తాజ్ గురించి ట్రంప్ కు చెప్పిన గైడ్ ఎవరో తెలుసా అతని బ్యాగ్రౌండ్

తాజ్ గురించి ట్రంప్ కు చెప్పిన గైడ్ ఎవరో తెలుసా అతని బ్యాగ్రౌండ్

0
93

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత దేశ పర్యటనకు వచ్చారు.. భార్య కుమార్తె అల్లుడుతో ఆయన అమెరికా నుంచి భారత్ కు వచ్చారు, అయితే అతని భార్య మెలానియాలు తాజ్ మహల్ అందాలను చూసి ఆనందం వ్యక్తం చేశారు, చూడటానికి చాలా బాగుంది అని అన్నారు, ఇక వారికి తాజ్ గురించి దాని విశిష్టత గురించి అక్కడ ఓ గైడ్ పూర్తిగా వివరించారు.

గైడ్గా నితిన్ సింగ్ వ్యవహరించారు. ఆయన ట్రంప్కే కాకుండా పలు దేశాల అధ్యక్షులు, ప్రధానులు, ఇతర ప్రముఖులకు తాజ్ గొప్పతనాన్ని వివరించి చూపారు. ఆయన ఈ చరిత్ర చెప్పడంతో ఎక్స్ పర్ట్ అలాగే మంచి ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉంది, అనర్గళంగా హిందీ ఇంగ్లీష్ మరో మూడు భాషలు మాట్లాడే సత్తా ఉన్న గైడ్ .

అందుకే ఆయనని గైడ్ గా నియమించారు…ఆగ్రాలోని కట్రా ఫులెల్కు చెందిన నితిన్ తాజ్ మహల్ ఘనతను, దాని వెనుకనున్న ప్రేమకథను ట్రంప్కు వివరించారు.ఇక నితిన్ చెప్పిన విధానం వారికి బాగా నచ్చింది, గతంలో నితిన్ ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు, బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో, కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో, ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, మంగోలియా అధ్యక్షుడు ఖల్ట్మాగిన్ బతుల్గా, బెల్జియం రాజు ఫిలిప్లకు తాజ్ మహల్ను చూపించారు.నిజంగా అతను కూడా గొప్ప అదృష్టవంతుడే అని చెప్పాలి.