ప్ర‌పంచంలో ఎక్క‌డా లేని గొప్ప ఆయుధం భార‌త్ కు ఇస్తున్నా- ట్రంప్

ప్ర‌పంచంలో ఎక్క‌డా లేని గొప్ప ఆయుధం భార‌త్ కు ఇస్తున్నా- ట్రంప్

0
105

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ఎంతో గ్రాండ్ వెల్ కం ప‌లికారు మ‌న దేశీయులు.. అలాగే మ‌న దేశ ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ వెల్ కం చెప్పారు, ఇక సాధ‌రంగా శ్వేత‌సౌథం నుంచి వ‌చ్చిన ట్రంప్ కుటుంబానికి న‌రేంద్ర‌మోదీ గుజ‌రాత్ అధికారులు ఆహ్వనం ప‌లికారు.

అహ్మదాబాద్ మొతేరా స్టేడియంలో ఏర్పాటు చేసిన నమస్తే ట్రంప్ కార్యక్రమంలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారత్ తో తమ బంధం మరింత బలోపేతం అవుతోందని అన్నారు.ఉగ్ర‌వాదం అణిచివేస్తున్నామ‌ని తెలిపారు, అంతేకాదు రేపు తాము కీల‌క ఒప్పందాలు చేసుకుంటున్నాము అని తెలిపారు ఆయ‌న‌.

భారత్ తో 3 బిలియన్ డాలర్ల విలువైన రక్షణ ఒప్పందాలను కుదుర్చుకుంటామని వెల్లడించారు. అమెరికా, భారతదేశాలు రెండూ అతివాద ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని ఎదుర్కొంటున్నాయని, ఈ అంశం రెండు దేశాలను ఏకం చేస్తోందని తెలిపారు.ఈ భూమండలం మీద అత్యుత్తమం అనదగ్గ మిలిటరీ పరికరాలను అందించాలనుకుంటున్నాం. ఈ ఆయుధాలు ఇప్ప‌టి వ‌ర‌కూ ఎవ‌రూ త‌యారు చేయ‌లేదు మాద‌గ్గ‌ర ఉన్నాయి అని తెలిపారు ట్రంప్ , రేపు వీటిపై ఒప్పందం కుదుర్చుకోనున్నారు.