భారత్ లో హోటల్ మౌర్యలో ట్రంప్ ఉండే సూట్ గురించి తెలిస్తే మతిపోతుంది

భారత్ లో హోటల్ మౌర్యలో ట్రంప్ ఉండే సూట్ గురించి తెలిస్తే మతిపోతుంది

0
78

భారత పర్యటనలో ఉన్నారు ట్రంప్ అయితే అమెరికా అధ్యక్షుడి రాకకు భారీ ఏర్పాట్లు చేశారు, స్వాగతం కూడా అలాగే ఏర్పాట్లు చేశారు.. గతంలో అమెరికా అధ్యక్షులు బుష్, క్లింటన్, ఒబామా ఉన్న సూట్ లోనే ట్రంప్ ఉంటారు..ట్రంప్.. 446 చదరపు అడుగుల విశాలమైన గ్రాండ్ ప్రెసిడెంట్ సూట్ అయిన చాణక్యలో ఉంటారు అని తెలుస్తోంది, దాదాపు 250 మంది సెక్యూరిటీ అన్నీ వైపులా భద్రత కల్పిస్తారు, ఎయిర్ మార్షల్స్ కూడా ఇక్కడ సెక్యూరిటీగా ఉంటారు..

గతంలో భారత పర్యటనకు వచ్చిన అమెరికా మాజీ అధ్యక్షులు జార్జి బుష్, బిల్ క్లింటన్ , బరాక్ ఒబామా కూడా ఇదే సూట్ లో బస చేశారు. ఇందులో నెమలి థీమ్లోని 12 సీట్ల ప్రైవేట్ డైనింగ్ రూమ్, ముత్యాలతో పొదిగిన సామగ్రితో కూడిన బాత్ రూమ్ , మినీ స్పా, జిమ్ ఉన్నాయి. ఆయన కోసం ప్రత్యేకంగా బంగారం వెండితో కొన్ని వస్తువులు చేయించారు, బంగారు స్పూన్లు పళ్లాలలో ఆయనకు ఆహరం పెట్టనున్నారట.

ఈ సూట్ కు బుల్లెట్ ఫ్రూఫ్ గ్లాస్ లు ఏర్పాటు చేశారు. అలాగే, సూట్ నుంచి నేరుగా హోటల్ కు, పార్కింగ్ ఏరియాకు వెళ్లేందుకు ప్రత్యేక దారి ఉంటుంది. హై స్పీడ్ ఎలివేటర్ కూడా ఉంది. అలాగే, ప్రెసిడెన్షియల్ సూట్ లో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రమాణాల ప్రకారం స్వచ్ఛమైన గాలి ఉండేలా ఏర్పాట్లు చేశారు. ఈ సూట్ కు ఎదురుగా ఉండే మరో సూట్ ను ఇవాంకాకు కేటాయించారు.
వారు ఉండే రెండు రోజులు ఇక్కడే ఉండనున్నారు.. దాదాపు వేలాది మంది భద్రతా బలగాలు ఢిల్లీ లో చాలా కట్టుదిట్టమైన భధ్రతలో ఉన్నాయి.