ట్రంప్ వెంటనే ఈపని చేయాలి బిల్ గేట్స్ సూపర్ సలహ

ట్రంప్ వెంటనే ఈపని చేయాలి బిల్ గేట్స్ సూపర్ సలహ

0
110

అమెరికా కరోనాతో దారుణమైన స్దితిలో ఉంది… ఆర్ధిక ఇబ్బంది ఎలా ఉన్నా సంక్షోభం ఎలా ఉన్నా డబ్బులు తర్వాత అయినా సంపాదించుకోవచ్చు కాని ప్రాణాలు పోతున్న వారు చాలా మంది ఉన్నారు.. ఇక వయసు మళ్లిన వారి మరణాలు ఇటలీని దాటి ఇక్కడ కూడా పెరుగుతున్నాయి, దీనిని అమెరికా తక్కువ అంచనా వేసింది.. కాని ఇప్పుడు ఇదే అమెరికా కొంప ముంచింది.

ఈ సమయంలో అమెరికా వ్యాప్తంగా పది వారాల పాటు షట్ డౌన్ ను కఠినంగా అమలు చేయాలని, లేకుంటే తీవ్ర ఆర్థిక సంక్షోభం తప్పదని మైక్రోసాఫ్ట్ సహ వ్యావస్థాపకుడు బిల్ గేట్స్ సూచించారు. దేశంలో కరోనా కేసులు 2 లక్షలకు చేరిన నేపథ్యంలో, ఆయన ది వాషింగ్టన్ పోస్ట్ ఎడిటోరియల్ పేజీతో తన అభిప్రాయాలను పంచుకున్నారు.

ముందు ఈ వైరస్ గురించి ఎవరిని విమర్శించకుండా దీనిని కట్టడి చేసేందుకు మనం ఏం చేయాలో చూడాలి అని తెలిపారు..చాలా రాష్ట్రాల్లో బీచ్ లు ఇంకా తెరచుకునే ఉన్నాయి. రెస్టారెంట్లు పని చేస్తున్నాయి. ప్రజలు స్వేచ్ఛగా ప్రయాణిస్తున్నారు. వారిలానే వైరస్ కూడా వ్యాపిస్తోంది. దీన్ని అడ్డుకోవాలంటే షట్ డౌన్ ఒక్కటే మార్గం అని ఆయన అన్నారు. అయితే బిల్ గేట్స్ ఇలా అన్నారో లేదో చాలా మంది ఇదే ట్రంప్ కు చెబుతున్నారు, ట్రంప్ నేడో రేపో దీనిపై కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది.