తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీత రావు అరెస్ట్

Telangana Mahila Congress president Sunita Rao arrested

0
94

తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీత రావు ఆధ్వర్యంలో ప్రగతి భవన్ ముట్టడి జరిగింది. టీపీసీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మలను టిఆర్ఎస్ నాయకులు కాల్చినందుకు నిరసనగా ప్రగతి భవన్ ముట్టడించడం జరిగింది.

ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ..టిఆర్ఎస్ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది. తెలంగాణ ముఖ్యమంత్రి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు బుద్ధి లేని విధంగా ప్రవర్తిస్తున్నారు. కాబట్టి ముఖ్యమంత్రి గానీ రేపటి నుండి మంత్రులను రోడ్లమీద తిరగనియ్యం ఖబర్దార్.

మహిళలు అని చూడకుండా పోలీసులు పెట్టిన అక్రమ అరెస్టులు చేసి గోషామహల్ పోలీస్ స్టేషన్ కు తరలించడం మహిళ కాంగ్రెస్ తరఫున ఖండిస్తున్నాం. అరెస్టు చేసిన మహిళలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షురాలు సునీత రావుతో పాటు వైస్ ప్రెసిడెంట్ వరలక్ష్మి, ప్రెసిడెంట్ కవిత జనరల్ సెక్రటరీ కవిత మొదలగు వారిని అరెస్టు చేశారు.