TS TET 2022 Notification: సబ్జెక్టుల వారిగా టెట్ పేపర్ 1 సిలబస్ ఇదే..

0
94

తెలంగాణ స్టేట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ నోటిఫికేషన్ వచ్చేసింది. మార్చి 26 నుంచి ఏప్రిల్ 12 వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది. జూన్ 12న టెట్ నిర్వహించనుంది ప్రభుత్వం. అలాగే జూన్ 27న ఫలితాలు విడుదలవుతాయి.

టెట్‌లో రెండు పేపర్లు ఉంటాయి. అందులో పేపర్‌-1 సెకండరీ గ్రేడ్‌ టీచర్లుగా నియామకానికి, పేపర్‌-2 స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టుల కోసం అర్హత సాధించేందుకు నిర్వహిస్తారు. ఒక్కో పేపర్‌ 150 మార్కులకు ఉంటుంది. పేపర్‌-1కు 1-8 తరగతులు, పేపర్‌-2కు 6-10 తరగతుల ప్రామాణికంగా ప్రశ్నలు ఉంటాయి. ప్రస్తుతం టెట్‌ సిలబస్‌లో ఎటువంటి మార్పూ లేదు. 2017 సిలబస్ ఆధారంగానే పరీక్ష నిర్వహించనున్నారు.

టెట్ పేపర్ 1 లో 150 ప్రశ్నలకు 150 మార్కులు ఉంటాయి. చైల్డ్ డెవలప్‌మెంట్ అండ్ పెడగాగిలో 30 ప్రశ్నలకు 30 మార్కులు, లాంగ్వేజ్ 1 లో 30 ప్రశ్నలకు 30 మార్కులు, లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్‌లో 30 ప్రశ్నలకు 30 మార్కులు, మ్యాథమెటిక్స్‌లో 30 ప్రశ్నలకు 30 మార్కులు, ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్‌లో 30 ప్రశ్నలకు 30 మార్కులు ఉంటాయి. ప్రతీ సెక్షన్‌కు 30 నిమిషాల చొప్పున రెండున్నర గంటల సమయం ఉంటుంది.

paper 1 సిలబస్ ఇదే..

శిశు అభివృద్ధి, బోధన శాస్త్రం (30 మార్కులు): శిశు అభివృద్ధి నమూనాలు, నేర్చుకునే సామర్థ్యం, బోధన శాస్త్ర అవగాహన

తెలుగు భాష (30 మార్కులు) : పఠనావగాహన, తెలంగాణ సాహిత్యం, సంస్కృతి, పదజాలం, భాషాంశాలు, బోధన పద్ధతులు

ఆంగ్ల భాష (30 మార్కులు) : ఆంగ్లభాష విషయాలు, వ్యాకరణం (24 మార్కులు), ఆంగ్ల బోధన శాస్త్రం (6 మార్కులు)

గణితశాస్త్రం (30 మార్కులు) : సంఖ్యామానం, భిన్నాలు, అంకగణితం, రేఖాగణితం, కొలతలు, డేటా అప్లికేషన్స్‌, ఆల్‌జీబ్రా (24 మార్కులు), గణిత బోధన పద్ధతులు (6 మార్కులు)

పర్యావరణ అధ్యయనం (30 మార్కులు) : నా కుటుంబం, పని, ఆటలు, మొక్కలు, జంతువులు, మన ఆహారం, వసతి, గాలి, ఇంధనం, నీరు, ఆరోగ్యం, పరిశుభ్రత, భౌగోళిక మ్యాపులు, భారత దేశ చరిత్ర- సంస్కృతి, భారతదేశం- తెలంగాణ సంస్కృతి, పట్టణాలు, జీవన విధానం, సహజవనరులు, నదులు, నాగరికత, భారత రాజ్యాంగం, భద్రత (భూకంపాలు, వరదలు, ఆగ్నిమాపక, ప్రాథమిక చికిత్స, 108, 104 వాహనాలు) (24 మార్కులు), పర్యావరణ బోధన శాస్త్రం (6మార్కులు)