తెలంగాణ నిరుద్యోగులకు అలర్ట్..ఇప్పటికే సీఎం కేసీఆర్ మార్చి 9న అసెంబ్లీలో ఉద్యోగాల భర్తీపై కీలక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. 91 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ అంటూ కేసీఆర్ నిరుద్యోగులను అలర్ట్ చేశారు. తాజాగా ఉద్యోగాల భర్తీపై తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ (TSPSC) బి జనార్దన్ రెడ్డి కీలక ప్రకటన చేశారు.
ఇప్పుడొచ్చే నోటిఫికేషన్లపై న్యాయ వివాదాలు తలెత్తకుండా చూస్తామన్నారు. అలాగే నిర్ణీత గడువులోగా ఉద్యోగ నియామక ప్రక్రియ పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని ఆయన వివరించారు. త్వరలోనే వెలువడే ప్రభుత్వ ఉత్తర్వులతో పోస్టులు అలాగే భర్తీ ప్రక్రియ మరింత స్పష్టత వస్తుందని ఆయన తెలిపారు.
అలాగే ప్రిపరేషన్ కు సమయం ఉండేలా నోటిఫికేషన్ ఇస్తూ రాత పరీక్ష నిర్వహిస్తామన్నారు. టీఎస్పీఎస్సీ నియామకాలపై సోషల్ మీడియాలో, ఇతర మాధ్యమాలలో వచ్చే అసత్య ప్రచారాలను నమ్మవద్దని విద్యార్థులను కోరారు. అలాంటి అసత్య ప్రచారాలు ప్రచారం చేస్తే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.