పాక్ బోర్డర్ కశ్మీర్ లో తిరుమల వెంకన్న ఆలయం భక్తులు ఏమంటున్నారంటే

పాక్ బోర్డర్ కశ్మీర్ లో తిరుమల వెంకన్న ఆలయం భక్తులు ఏమంటున్నారంటే

0
88

తిరుమల వెంకన్న స్వామిని దర్శించుకోవాలి అని భక్తులు లక్షలాది మంది నిత్యం అక్కడకు చేరుకుంటారు… ఆ ఏడు కొండల వాడిని దర్శించుకునేందుకు కాలి నడకన కూడా చేరుకుంటారు.. ఇక వెంకన్న స్వామి ఆలయాలు దేశంలో నలుమూలలా ఉన్నాయి, అంతేకాదు తితిదే ఆ దేవాలయాల ఖర్చులని కూడా భరిస్తుంది.

తాజాగా జమ్ముకశ్మీర్ రాష్ట్రంలోని భారత్-పాకిస్థాన్ సరిహద్దులో శ్రీవారి ఆలయ నిర్మాణానికి తిరుమల తిరుపతి దేవస్థానం చురుకుగా చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా అక్కడ ఆలయ నిర్మాణానికి అవసరమైన స్థలం ఎంపిక కోసం టీటీడీ ఈఓ అనిల్ సింఘాల్ ఈరోజు ఆ రాష్ట్రానికి వెళ్తున్నారు. దీంతో అక్కడ చాలా మంది భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

తిరుమల స్వామి ఆలయం ఇక్కడ నిర్మించాలి అని ఏనాటి నుంచో అనుకుంటున్నారు, తాజాగా ఈ నిర్మాణానికి ఇప్పుడు సమయం వచ్చింది అని అంటున్నారు చాలామంది. కశ్మీర్తోపాటు ప్రధాని నరేంద్రమోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి, ముంబయిలలో వేంకటేశ్వరస్వామి ఆలయాల నిర్మాణానికి నిర్ణయం తీసుకుంది తితిదే. ఇక జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం తితిదే కి రెండు స్ధలాలు చూపించింది ..అందులో ఒకటి ఎంపిక చేయనున్నారు ఈవో.