టీటీడీ సంచలన నిర్ణయం..ప్రధాని నుంచి సామాన్యుడి వరకు ఒకే రకమైన భోజనం

0
79

టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి తిరుమలలో ప్రధాని మొదలు సామాన్యుల భక్తులందరికీ ఒకే రకమైన భోజనం అందించాలని నిర్ణయించింది. ప్రైవేటు హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లను తొలగించి, భక్తులందరికీ శ్రీవారి అన్నప్రసాదం అందేలా చర్యలు తీసుకోనున్నట్టు టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. తిరుమలలో భోజనాన్ని భక్తులు డబ్బుతో కొనుగోలు చేయొద్దన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన తెలిపారు.