ఉక్రెయిన్ – రష్యా వార్..యుద్ధం ఆపేయాలని ఐసీజే కీలక ఆదేశాలు

0
80

ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం చేస్తున్న వేళ అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) కీలక ఆదేశాలు జారీ చేసింది. ఉక్రెయిన్‌పై సైనిక ఆపరేషన్‌ను వెంటనే నిలిపివేయాలని సూచించింది. ఉక్రెయిన్‌పై దాడులు నిలిపివేసి.. ఆ దేశ భూభాగం నుంచి రష్యా తన భద్రతా బలగాలను ఉపసంహరించుకోవాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వొలొదిమిర్​ జెలెన్‌స్కీ రష్యాపై అంతర్జాతీయ న్యాయస్థానంలో వేసిన కేసులో తమ దేశం పూర్తి విజయం సాధించిందని పేర్కొన్నారు.