సూసైడ్ కు పాల్పడ్డ ఉమా మహేశ్వరి..పోలీసులకు చేరిన పోస్ట్ మార్టం నివేదిక

0
107

మాజీ సీఎం, దివంగత నటుడు NTR చిన్నకూతురు ఉమామహేశ్వరి 4 రోజుల క్రితం ఆత్మహత్యకు పాల్పడి మృతి చెందిన విషయం తెలిసిందే. ఇక తాజాగా కంఠమనేని ఉమా మహేశ్వరి పోస్టుమార్టం నివేదికను ఉస్మానియా ఫోరెన్సిక్ సైన్స్ వైద్యులు జూబ్లీహిల్స్ పోలీసులకు అందజేశారు.

పోస్టుమార్టం నివేదికలో ఆమె సూసైడ్ కు పాల్పడినట్టు తేలింది. ఆమె చున్నీతో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మ‌హ‌త్య చేసుకున్నట్టు పోస్ట్ మార్టం నివేదిక ద్వారా తెలిసింది. మహేశ్వరి మెడ భాగంలో త్రోట్ స్వర పేటిక బ్రేక్ అవ్వడం వల్ల ప్రాణాలు కోల్పోయినట్లు తెలిసింది.

ఉమా మహేశ్వరి హ్యాంగ్ తనకు తాను ఉరి వేసుకుని చనిపోయినట్టు పిఎంఈ రిపోర్ట్ ఇచ్చింది. అయితే ఈ నెల 1న తన నివాసంలో ఉమామహేశ్వరి అనుమానాస్పదంగ మృతి చెందింది. దీనితో జుబ్లిహిల్స్ పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. కుటుంబ సభ్యుల రిక్వేశన్ మేరకు పోస్టుమార్టం నిర్వహించిన ఉస్మానియా ఫోరెన్సిక్ సైన్స్ వైద్య బృందం పిఎంఈ రిపోర్ట్ ను పోలీసులకు అందజేశారు.