అన్ లాక్ 3.0 మార్గదర్శకాలను కేంద్రం ఇప్పటికే విడుదల చేసింది, ఆగస్ట్ 1 నుంచి సరికొత్త మార్గదర్శకాలు వచ్చాయి, అయితే కేంద్ర హోం మంత్రిత్వ శాఖ విడుదల చేసిన అన్ లాక్ 3.0 మార్గదర్శకాలను ఇప్పటికే అన్నీ స్టేట్స్ అమలు చేస్తున్నాయి.
తాజాగా ఏపీ కూడా ఈ మార్గదర్శకాలు అమలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది., ఇక నేటి నుంచి ఏపీలో అన్ లాక్3 ప్రక్రియ మొదలయినట్టే. కేంద్ర మార్గదర్శకాల ప్రకారం ఆగస్టు 31 వరకు విద్యాసంస్థలకు అనుమతులు లేవు.
కాలేజీలు స్కూళ్లు ఇలాంటివి ఏమీ అనుమతి లేదు.యోగ ట్రైనింగ్ సెంటర్ లు, జిమ్ లకు నేటి నుండి అనుమతి ఇచ్చారు. ఇక ఇవన్నీ కూడా ఏపీలో అమలు అవుతాయి, అయితే ఎవరైనా ఏపీకి రావాలి అంటే ఈపాస్ తీసుకుని రావాల్సిందే.