జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు మాజీ ఎంపీ ఉండవల్లి సహాలు ఇచ్చారు… తాజాగా రాజమండ్రిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… రాజధాని రైతులది త్యాగం కాదని అన్నారు… త్యాగం చేసిన వారు డబ్బులు అడగరని అన్నారు..
గత ప్రభుత్వం వెల్లడించిన రియల్ ఎస్టేట్ ప్రణాళికకు ఒప్పుకుని భూములు ఇచ్చారని తెలిపారు… అమరావతి పెద్ద సిటీగా మారితే భారీగా డబ్బులు వస్తాయని భావించి ప్రభుత్వానికి భూములు ఇచ్చారని ఉండవల్లి అన్నారు… అలాగే పవన్ కళ్యాణ్ రాజకీయంపై ఆయన స్పందించారు…
పవన్ సినిమాలు చేసుకుంటే బెటర్ అని అన్నారు… ఇదే విషయాన్ని గతంలో కూడా చెప్పానని అన్నారు… అయితే ఇది కుదరదని పవన్ చెప్పారని ఇప్పుడు కుదిరిందని అన్నారు… ఎన్నికల సమయంలో సీఎం అయ్యే ఛాన్స్ ఉందని ఆలోచనలో పవన్ ఉండి ఉంటారని అందుకే గతంలో రెండు కుదరవని చెప్పిఉంటారని ఇప్పుడు మరో నాలుగు సంవత్సరాల వరకు ఎన్నికలు లేవు కాబట్టి రీ ఎంట్రీ ఇచ్చారని తెలినారు… తన ఉద్దేశం ప్రకారం పవన్ సినిమాలో నటించడం కరెక్ట్ అని అన్నారు ఉండవల్లి…