కాంగ్రెస్ ఆధ్వర్యంలో “నిరుద్యోగ నిరసన దీక్ష”

0
96

తెలంగాణ: గాంధీ భవన్ లో రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు శివసేన రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ..నిరుద్యోగ సమస్యలపై..ఇప్పటికే అసెంబ్లీ స్థాయిలో దీక్షలు, ఎమ్మెల్యేలను క్యాంపు కార్యాలయాల ముట్టడి చేశాం. టీఆర్ఎస్ సర్కార్ నిలదీసేలా మరోసారి యూత్ కాంగ్రెస్ పోరాటానికి సిద్ధంగా ఉంది. ఈనెల 27న 10 నుండి సాయంత్ర 5 గంటల వరకు “నిరుద్యోగ నిరసన దీక్ష” గాంధీ భవన్ లో నిర్వహిస్తున్నట్లుగా శివసేన రెడ్డి తెలియజేశారు.

రెండు రోజులు క్రితం పోలీసులకు వినతి పత్రం సమర్పించగా దీక్షకి అనుమతులు మంజూరు చేస్తున్నట్లు పోలీస్ శాఖ తెలియజేయడం జరిగింది. ఈ రోజు పోలీస్ శాఖ దీక్ష అనుమతులు రద్దు చేస్తున్నట్లుగా తెలియజేస్తున్నారు. పోలీసులు ప్రభుత్వానికి తొత్తులుగా పని చేస్తున్నారు. నిరుద్యోగ నిరసన దీక్ష స్థలం ఇందిరా పార్క్ నుండి గాంధీ భవన్ లో నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. కావున ప్రతి నిరుద్యోగి గమనించి దీక్షలో అందరూ పాల్గొనాలి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న నిరుద్యోగులు అందరూ “నిరుద్యోగ నిరసన దీక్షలో పాల్గొని యువజన కాంగ్రెస్ కి మద్దతు తెలపాలి.

బిశ్వాల్ కమిటీ 2018లోనే లక్ష 91వేల ఖాళీలున్నాయని చెప్పింది. వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేసి ఉద్యోగాలు భర్తీ చేయాలి. ఎన్నికల సమయంలో నిరుద్యోగ భృతి అని చెప్పి యువతను మోసం చేస్తున్నారు. ఇప్పటి వరకు నిరుద్యోగ యువతకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ప్రతి నిరుద్యోగికి లక్ష 14 వేలు బాకీ ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చెల్లించాలి. ఆత్మబలిదానాలతో ఏర్పడ్డ తెలంగాణాలో ఉద్యోగాలు రాక యువత చనిపోతున్నారని, యువజన కాంగ్రెస్ ఒకసారి నిర్ణయం తీసుకున్నాక వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు శివసేన రెడ్డి పేర్కొన్నారు.