ఛత్తీస్‌‌గఢ్ వినూత్న పథకానికి అనూహ్య స్పందన..గోమూత్రం, పేడ కొంటున్న ప్రభుత్వం

0
97

ఛత్తీస్‌‌గఢ్ ప్రభుత్వం వినూత్న పథకానికి శ్రీకారం చుట్టింది. 2020 జూలై 20న గోధన్ న్యాయ్ యోజన పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకానికి అద్భుతమైన స్పందన వస్తోంది. హరేలీ పండగ సందర్భంగా ఈ పథకాన్ని ప్రారంభించగా.వ్యవసాయం పనుల ప్రారంభం సందర్భంగా ఏటా హరేలీ పండగను నిర్వహిస్తారు.

ఈ పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా రైతులు, పశువుల యజమానుల నుంచి పేడను సేకరిస్తున్నారు. కిలోకు రూ.2 చొప్పున కొనుగోలు చేస్తున్నారు. వర్మీ కంపోస్ట్‌ను తయారు చేసేందుకు వీలుగా పెద్ద మొత్తంలో సేకరిస్తున్నారు. త్వరలో ఆవు మూత్రాన్ని కూడా కోనుగోలు చేయనున్నారు. దీనిని సేంద్రీయ పురుగుమందుల తయారీకి ఉపయోగించనున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో చాలా చోట్ల బయో ఫెస్టిసైడ్స్‌ తయారవుతున్నాయి.

సేంద్రీయ పురుగుల మందులతో అందరికీ మేలు జరుగుతుందని. ఆవు మూత్రంతో రైతులకు అదనపు ఆదాయం వస్తుందని ప్రభుత్వం తెలిపింది. లీటరు గోమూత్రం ధరను రూ.4గా కమిటీ నిర్ణయించినట్లు సమాచారం. దీనికి సీఎం భూపేష్ బఘేల్ ఆమోదం తెలపాల్సి ఉందని సీఎం ముఖ్య సలహాదారు ప్రదీప్ శర్మ తెలిపారు. గోమూత్రాన్ని గ్రామ గోఠాన్‌ సమితి ద్వారా సేకరిస్తామని ఆయన చెప్పారు. (