హైదరాబాద్ అమీర్ పేటలో పోసాని కృష్ణ మురళి ఇంటి ముందు గుర్తు తెలియని వ్యక్తులు వీరంగం సృష్టించారు. పోసానిని బండ బూతులు తిడుతూ..రాళ్లతో ఇంటిపై దాడి చేశారు. ఆ ఇంటి వాచ్ మెన్ తెలిపిన వివరాలు, సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు.
ప్రస్తుతం ఆ ఇంట్లో పోసాని ఉండట్లేదని తెలుస్తుంది. రెండు రోజుల కింద సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో పోసాని పవన్ కళ్యాణ్ పై చేసిన ఘాటు వ్యాఖ్యలకు గానూ పవన్ ఫాన్స్ దాడికి దిగగా..పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు కూడా నమోదు చేశారు. తాజాగా జరిగిన పరిణామాల దృష్యా పవన్ కళ్యాణ్, పోసానిల వార్ ఎంతవరకు వెళ్తుందో వేచి చూడాలి.