సెప్టెంబర్ 1 నుంచి భారత్ లో అన్ లాకింగ్ ఏం రూల్స్ ఉంటాయంటే

సెప్టెంబర్ 1 నుంచి భారత్ లో అన్ లాకింగ్ ఏం రూల్స్ ఉంటాయంటే

0
83

ఈ కరోనా మహమ్మారి ప్రపంచాన్నీ వణికిస్తోంది, 9 నెలలుగా కేసులు పెరుగుతూనే ఉన్నాయి, భారత్ కూడా ఆరు నెలలుగా కరోనా గుప్పిట్లో చిక్కకుంది, ముందు మూడు నెలలు లాక్ డౌన్ అమలు చేశారు, తర్వాత నెమ్మదిగా సడలింపులు ఇస్తూ అన్ లాకింగ్ ప్రక్రియ స్టార్ట్ అయింది.

అయితే భారత్ ఆగస్ట్ నెలాఖరికి ఇక అన్ లాకింగ్ ప్రక్రియను పూర్తి చేసేసి… లాక్ డౌన్ కు చెల్లు చీటి ఇవ్వనుందా అనే వార్తలు వినిపిస్తున్నాయి, అయితే ఇప్పటికే చాలా వరకూ సడలింపులు ఇచ్చారు,
కేవలం సినిమా హాళ్లు పార్కులు విద్యా సంస్థలు అంతర్జాతీయ విమాన ప్రయాణాలు ఇంకా నడవడం లేదు.

వీటికి కూడా వచ్చే నెల నుంచి పర్మిషన్ ఇవ్వనున్నారు అని తెలుస్తోంది, దీంతో ఇక అక్ లాకింగ్ ప్రక్రియ పూర్తిగా నిలిపేస్తారు అంటున్నారు కొందరు నిపుణులు, వచ్చే నెల నుంచి స్కూళ్లు కూడా ఓపెన్ అవ్వనున్నాయి.దేశంలోని అన్ని రకాల కార్యకలాపాలు ఇక సెప్టెంబర్ 1 నుంచి స్టార్ట్ అవుతాయి అని తెలుస్తోంది… సెప్టెంబర్ 5 నుంచి విద్యా సంస్థలన్నీ ఓపెన్ అవుతాయి..మరి చూడాలి కొన్ని చోట్ల కేసులు పెరుగుతున్నాయి కాబట్టి అక్కడ ఆ రాష్ట్రాలకే లాక్ డౌన్ నియమాలు పెట్టుకోవచ్చు అనే సౌలభ్యం ఇవ్వచ్చు అంటున్నారు.