అన్ లాక్ .2 తాజాగా కేంద్రం మార్గదర్శకాలు ఇవే

అన్ లాక్ .2 తాజాగా కేంద్రం మార్గదర్శకాలు ఇవే

0
93

లాక్ డౌన్ నుంచి కేంద్రం మ‌రిన్ని స‌డ‌లింపులు ఇచ్చింది, తాజాగా అన్ లాక్ 2 న‌డుస్తోంది, తాజా‌గా దీనికి సంబంధించి మార్గ‌ద‌ర్శకాల‌ను విడుద‌ల చేశారు.కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న కంటైన్‌మెంట్ జోన్లలో మాత్రం జూలై 31 వరకు లాక్‌డౌన్ అమల్లో ఉంటుంది. ఇక రాత్రి 10 గంట‌ల వ‌ర‌కూ స‌మ‌యం ఇచ్చారు ఆ త‌ర్వాత పూర్తిగా క‌ర్ఫూ వాతావ‌ర‌ణం ఉంటుంది.

రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 వరకు కర్ఫ్యూ ఉంటుంది. నైట్ కర్ఫ్యూలో నిత్యాసవర సరుకులు రవాణా చేసే వాహనాలు, పరిశ్రమలకు మాత్రమే అనుమతి ఉంటుంది. ఇక రైళ్లు విమానాల‌లో ప్ర‌యాణం చేసిన వారు ఇంటికి వెళ్లే స‌మ‌యంలో వారి టికెట్స్ చూపించి క్యాబ్ లో వారి వాహ‌నాల్లో వెళ్ల‌వ‌చ్చు.

విద్యా సంస్థలు, మెట్రో రైళ్లు, జిమ్‌లు, సినిమా హాళ్లు, బహిరంగ సభలు, సామూహిక మత ప్రార్థనలపై జూలై నెలాఖరు వరకు నిషేధం కొనసాగుతుంది. ఇక ప్ర‌త్యేక విమానాలు రైళ్లు మ‌రిన్ని స‌ర్వీసులు జూలై 10 త‌ర్వాత స్టార్ట్ అవుతాయి..మరిన్ని అదనపు సర్వీసులు ప్రారంభించనున్నారు. వాటిపై త్వ‌ర‌లో ప్ర‌క‌ట‌న వ‌స్తుంది.