తాజాగా కేంద్రం అన్ లాక్ 5 నిబంధనలు మార్గదర్శకాలు విడుదల చేసింది, అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్ అమలు కానున్నాయి, మరి ఏఏ సడలింపులు ఇంకా ఇచ్చింది అనేది చూద్దాం.
అక్టోబర్ 15 నుంచి స్కూళ్లు, కాలేజీలను తెరిచేందుకు కేంద్రం అనుమతించింది. అయితే దీనిపై ఆయా రాష్ట్రాలు, విద్యాసంస్థలే నిర్ణయం తీసుకుంటాయని తెలిపింది. స్టూడెంట్స్ కు సంబంధించి వారి తల్లిదండ్రులు అనుమతి ఇచ్చి ఒప్పందం పత్రం ఇస్తేనే నిర్ణయం తీసుకోవాలి.
ఆన్ లైన్, డిస్టెన్స్ విద్యకే ప్రాధాన్యతను ఇస్తున్నట్టు చెప్పింది. అయితే 10 ఏళ్ల కంటే తక్కువ వయసున్న విద్యార్థుల విషయంలో మాత్రం కేంద్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. తప్పకుండా హాజరుకావాలి అనే విషయంలో వారిని ఇబ్బంది పెట్టడానికి లేదు, ఒకవేళ ఏ పేరెంట్స్ అయినా స్కూలుకి పంపిస్తే ఆ ఒప్పంద పత్రంతో పంపించాలి.
ఎప్పుడు ఎప్పుడా అని ఎదురుచూస్తున్న సినిమా థియేటర్లు, మల్టీప్లెక్సులు, ఎగ్జిబిషన్ హాల్స్, ఎంటర్టైన్మెంట్ పార్కులకు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. 50 శాతం సీటింగ్ కెపాసిటీతో వీటిని నిర్వహించాలని తెలిపింది..కంటైన్మెంట్ జోన్ల వెలుపల అక్టోబర్ 15 నుంచి సినిమా థియేటర్లు, మల్టీప్లెక్సులు ఓపెన్ చేసుకోవచ్చు.
కంటైన్మెంట్ జోన్లలో లాక్డౌన్ను అక్టోబర్ 31 వరకు పొడిగిస్తున్నట్లు వెల్లడించారు…క్రీడాకారుల శిక్షణార్థం స్విమ్మింగ్ పూల్స్ తెరిచేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు . వినోద పార్కులు మూసివేసే ఉంటాయి..100 మందితో రాజకీయ, సాంస్కృతిక, మతపరమైన సమావేశాలు నిర్వహించుకోవచ్చు స్టేట్ పర్మిషన్ తీసుకోవాలి.