దేశంలో అన్ లాక్ 4 నిబంధనలు విడుదల చేసింది కేంద్రం, ఇక కొన్నింటికి పర్మిషన్ ఇచ్చారు మరికొన్నింటిపై ఆంక్షలు విధించారు, దేశంలో ఎవరు ఎక్కడ నుంచి ఎక్కడికి అయినా ప్రయాణం చేయవచ్చు, ఆంక్షలు లేవు ఈ పాస్ అక్కర్లేదు.
కేంద్రం అనుమతి లేకుండా రాష్ట్రాలు స్థానికంగా లాక్ డౌన్ ప్రకటించడానికి వీల్లేదు. అంతేకాదు అందరూ ఎదురుచూస్తున్న మెట్రో రైలు సేవలు సెప్టెంబ్ర 7 నుంచి దశలవారీగా ప్రారంభం అవుతాయి.
సెప్టెంబర్ 21 తర్వాత నుంచి 100 మందికి మించకుండా సామాజిక, విద్య, క్రీడా, వినోద, సాంస్కృతిక, ఆధ్యాత్మిక సంబంధిత సభలు నిర్వహించుకోవచ్చు.
ఇక ఆన్ లైన్ క్లాసులు నిర్వహిస్తే టీచర్లు 50 శాతం స్కూల్ కు హాజరు కావచ్చు, ఇక స్కూళ్లు కాలేజీలు సెప్టెంబర్ 30 వరకూ క్లోజ్ లోనే ఉంటాయి, సినిమా హాళ్లు, స్విమ్మింగ్ పూల్స్, ఎంటర్‌టైన్‌మెంట్ పార్క్‌లు, ధియేటర్లుఓపెన్ ఎయిర్ ధియేటర్లు మినహామూసి ఉంటాయి. మరో నెల వీటికి నో పర్మిషన్.