ఉంటే ఉండండి పోతే పొండి పవన్ సంచలన వ్యాఖ్యలు

ఉంటే ఉండండి పోతే పొండి పవన్ సంచలన వ్యాఖ్యలు

0
101

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని పవన్ కల్యాణ్ రెడ్డి అని నొక్కి వొక్కానించి పిలవడం పై పెద్ద ఎత్తున విమర్శలు చేశారు వైసీపీ నేతలు.. తాజాగా జగన్ ని ఎలా పిలవాలి మీరే చెప్పండి లేదా వైసీపీ ఎమ్మెల్యేలు 150 మంది తీర్మాణం చేసి ఎలా పిలవాలో చెప్పండి అని విమర్శించారు.. మంగళగిరిలో జనసేన ఆధ్వర్యంలో డొక్కా సీతమ్మ అన్నదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించి.. భవన నిర్మాణ కార్మికులకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వంపై పవన్ మండిపడ్డారు. 50 మంది భవన నిర్మాణ కార్మికులను ప్రభుత్వమే హత్య చేసిందని ఆరోపించారు. మంత్రి బొత్స సత్యనారాయణకు ఆకలి బాధలు తెలుసా అని విమర్శించారు.

గతంలో 1400 మంది చనిపోయారు అని ఓదార్పు యాత్ర చేశారు జగన్, మరి ఇప్పుడు ఎందుకు భవన నిర్మాణ కార్మికుల కోసం ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం ఏమిటి అని విమర్శించారు… వారి చావులు జగన్ గుర్తించరా అని నిలదీశారు.. కార్మికులకు ప్రభుత్వ సొమ్ము ఎందుకు ఇవ్వరు?, మీ భారతి సిమెంట్ నుంచి ఇవ్వమనడం లేదు కదా అని ప్రశ్నించారు. ఇప్పటి వరకూ పదవుల కోసం జనసేనలోకి వచ్చిన వారు, పదవుల కోసం వేరే పార్టీలోకి వెళ్లిపోయారు అని, ఇంకా అలాంటి వారు ఉంటే వెళ్లిపోవచ్చు అని తెలియచేశారు పవన్ కల్యాణ్ .