ఇదేంటి సెల్ ఫోన్ వాడితే సివిల్స్ పాస్ అయిపోవచ్చా అని ఆలోచిస్తున్నారా, అది కాదు అసలు మేటర్,
మనం ఈరోజుల్లో చాలా వరకూ స్మార్ట్ ఫోన్ తోనే సంసారం చేస్తున్నాం అని చెప్పాలి, ఎందుకు అంటే ఫోన్ లేనిదే కాలు బయట పెట్టడం లేదు, అన్నీ ఆ ఫోన్ నుంచే చేస్తున్నాం, స్మార్ట్ యుగంలో స్మార్ట్ ఫోన్ లేదా అని విచిత్రంగా చూస్తున్నారు.
అయితే బేసిక్ ఫోన్లు కొందరు వాడుతున్నా బాగా చదువుకున్న వారి నుంచి చదువుకుంటున్న వారి వరకూ అందరూ స్మార్ట్ ఫోన్లు వాడుతున్నారు. ఇది చాలా చేటు తెస్తోంది, చాలా ఉపయోగాలు కల్పిస్తోంది, ఈ సమయంలో స్మార్ట్ఫోన్పై ఓ ఐపీఎస్ అధికారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఇచ్చిన సలహాని చాలా మంది ఎస్ అంటున్నారు.
ఒడిశాకు చెందిన ఐపీఎస్ ఆఫీసర్ అరుణ్బోత్రా…సివిల్స్ సాధించాలంటే ముందు స్మార్ట్ఫోన్ను వదిలిపెట్టి.. దాని స్థానంలో నోకియా 5310ను వాడాలని సలహా ఇచ్చారు. .. విద్యార్థుల ఆశయ సాధనకు మాత్రం స్మార్ట్ ఫోన్ లు అడ్డుగా నిలుస్తాయని అన్నారు, ఓ అభ్యర్థి సివిల్ సర్వీసెస్ సాధించాలంటే ఏంచేయాలి? అని ట్విట్టర్లో అడిగారు. దీనికి ఆయన ఈ సమాధానం ఇచ్చారు, నిజమే స్మార్ట్ ఫోన్ వల్ల దానితోనే సమయం అయిపోతోంది, ఇక చదువు ఏకాగ్రత వేరేదానిపై ఉండదు అంటున్నారు నెటిజన్లు. దీంతో ఆయనని అభినందిస్తున్నారు అందరూ.