ఉత్తరాంధ్రా జనసైనికులకి కీలక పిలుపునిచ్చిన పవన్ కల్యాణ్

ఉత్తరాంధ్రా జనసైనికులకి కీలక పిలుపునిచ్చిన పవన్ కల్యాణ్

0
84

ఏపీ రాజధాని అమరావతి విషయంలో ఇప్పుడు తాజాగా సరికొత్త వాదనలు వినిపిస్తున్నారు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అలాగే పవన్ కల్యాణ్, అయితే వైసీపీ నిర్ణయాలని వ్యతిరేకిస్తున్న పవన్ కల్యాణ్ చంద్రబాబు జగన్ ని కూడా విమర్శిస్తున్నారు, విశాఖ డవలప్ మెంట్ కాదని అక్కడ భూముల పై కన్నేశారని విమర్శలు చేస్తున్నారు..

ఇప్పటికే అమరావతి రైతులు రోడ్డునపడ్డారని, ఇప్పుడు విశాఖపట్నం నగరానికి చుట్టుపక్కల 10 మండలాల్లో భూసేకరణ చేపట్టారని ఆరోపించారు. ఇక విశాఖవాసులకి కష్టాలు తప్పవు అనేలా కామెంట్లు చేస్తున్నారు. పేదరైతులకి మళ్లీ అన్యాయం చేసేందుకు సిద్దం అవుతోంది అని విమర్శించారు.

బాగా నష్టపోయేది ఎస్సీ, ఎస్టీ రైతులేనని పవన్ అభిప్రాయపడ్డారు. సుమారు 6 వేల ఎకరాల మేర అసైన్డ్ భూములను వెనక్కి తీసుకోబోతున్నారని ఆయన కామెంట్ చేశారు, ముఖ్యంగా అక్కడ రైతులకి ఎలాంటి హామీ ఇస్తున్నారో తెలుసుకోవాలి అని జనసైనికులకి తెలిపారు పవన్ కల్యాణ్.