మాజీ పిసిసి చీఫ్ హోదాలో తొలిసారి మీడియా ముందుకు ఉత్తమ్

0
119
Uttam Kumar Reddy

పిసిసి అధ్యక్ష పదవి మార్పు జరిగిన తర్వాత మాజీ పిసిసి అధ్యక్షుడి హోదాలో ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో పలు అంశాల మీద మాట్లాడారు. నల్లగొండ ఎంపీ హోదాలో ఉత్తమ్ కుమార్ రెడ్డి 36 గంటల సోమవారం మీడియా ముందుకొచ్చారు. శనివారం సాయంత్రం పిసిసి కొత్త కమిటీని అధిష్టానం ప్రకటించింది. కొత్త సారధిగా అనౌన్స్ కాగానే రేవంత్ రెడ్డి సీనియర్ నేతలు జానారెడ్డి, షబ్బీర్ అలీలను కలిశారు. ఆదివారం మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి సహా మరికొందరు నేతలను కలిశారు. సోమవారం పొన్నాల లక్ష్మయ్య, విహెచ్ లను కలిశారు. కానీ ఇప్పటి వరకు తాజా మాజీ పిసిసి చీఫ్ ఉత్తమ్ ను మాత్రం రేవంత్ రెడ్డి కలవలేకపోయారు. కారణాలేమిటో తెలియరాలేదు కానీ… రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు ఉత్తమ్ ఆశిస్సులు తీసుకునేందుకు వెళ్లలేదు. అయితే రేవంత్ రెడ్డి టిడిపిని వీడి కాంగ్రెస్ లోకి వచ్చే సందర్భంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వయంగా వెళ్లి రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు. తర్వాత కాలంలో ఇద్దరి మధ్య సంబంధాలు అంతగా లేవనే చెప్పాలి.

సోమవారం మీడియా ముందుకు వచ్చిన ఉత్తమ్.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన కామెంట్స్ పై మాట్లాడేందుకు నిరాకరించారు. ఉత్తమ్ ఇంకేమన్నారో కింద ఆయన కామెంట్స్ చదవండి.

తో మాట్లాడారు. ఆయన మాటల్లోనే..

కొత్త పీసీసీ అధ్యక్షులు, నూతన కమిటీకి నా శుభాకాంక్షలు.

అధిష్టానం తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి పనిచేయాలి.

కాంగ్రెస్ పార్టీ నాకు ఆరేండ్ల పాటు పీసీసీ చీఫ్ గా వుండే అవకాశం ఇచ్చింది.

కాంగ్రెస్ పార్టీ నాకు మంత్రి పదవిని, వర్కింగ్ ప్రెసిడెంట్ , పీసీసీ చీఫ్ గా అవకాశం ఇచ్చింది.

ప్రతి కాంగ్రెస్ కార్యకర్త పార్టీ కోసం కష్టపడి పని చేస్తున్నాడు.

కొందరు ఆస్తులు కూడా అమ్ముకొని కొందరు పనిచేస్తున్నారు

అందరికి పార్టీ అవకాశాలు ఇవ్వాలని కోరుకుంటున్నా.

నాకు పదవి వున్నా లేకున్నా.. పార్టీ కి లాయల్టీ గా పనిచేస్తా.

2023 లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేలా కృషి చేస్తా.