ఉత్తరాఖండ్లోని చమోలీ జిల్లాలో ఈ నెల 7వ తేదీన మంచు చరియలు విరిగిపడ్డాయి.. ఈ ప్రమాదంలో తపోవన్ పవర్ ప్రాజెక్టు పూర్తిగా ధ్వంసమైంది. దాదాపు 200 మంది గల్లంతు అయ్యారు… ఇక కొందరు తప్పించుకున్నారు సెకన్లలోనే నీరు మొత్తం చుట్టేసింది, అయితే ఈ ప్రమాదం నుంచి తప్పించుకున్న వారిలో విపుల్ కైరేనీ బృందం కూడా ఒకటి.
విపుల్ ఇక్కడ విద్యుత్ కేంద్రంలో క్రేన్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఆరోజు ఉదయం 9 గంటలకి పనికి వెళ్లాడు
తల్లి మాంగ్శ్రీదేవి పదేపదే ఫోన్ చేసింది. ఇలా ఆమె ఎందుకు అన్నీ సార్లు కాల్ చేస్తుందా అని ఫోన్ తీశాడు… వెంటనే ఆమె
సురక్షిత ప్రాంతానికి వెళ్లాలని కుమారుడిని కోరింది.
ఆమె ఇంటి బయట పని చేస్తుండగా దౌలిగంగ ఉవ్వెత్తున ఎగిసిపడుతూ ముందుకొస్తున్నట్లు చూసింది, వెంటనే కుమారుడు ప్రాజెక్టులో పని చేస్తున్నాడని ప్రాణాలు కాపాడాలి అని ఫోన్ చేసింది… కుమారుడు ముందు నమ్మలేదు తర్వాత మళ్లీ చేయడంతో తనతో పాటు మరో 25 మంది ఎత్తైన ప్రాంతానికి వెళ్లాం… అక్కడ నిమిషాల్లోనే నీరు వచ్చి చుట్టేసింది ఇలా అమ్మ ఫోన్ చేయకపోతే మేము చనిపోయే వాళ్లం అని ఆ వ్యక్తి తెలిపాడు.