వాహన దారులకి కొత్త రూల్స్ ఇక బండికి యజమానితో పాటు నామినీ – కొత్త రూల్ ఇదే

వాహన దారులకి కొత్త రూల్స్ ఇక బండికి యజమానితో పాటు నామినీ - కొత్త రూల్ ఇదే

0
84

వాహనాలు నడిపే వారికి ఓ అలర్ట్ కొత్త రూల్స్ కేంద్రం అమలులోకి తీసుకురానుంది, మోదీ సర్కారు దీనిపై ప్లాన్ రచిస్తోంది అని తెలుస్తోంది.. రోడ్డు రవాణ జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ సెంట్రల్ మోటార్ వెహికల్ రూల్స్ 1989కు సవరణ చేయాలని ప్రతిపాదించింది. అయితే ఏ రూల్స్ అనేది ఓసారి చూద్దాం.

ముఖ్యంగా వాహనం ఓనర్ షిప్ విషయంలో రూల్స్ మారనున్నాయి.డ్రాఫ్ట్ నోటిఫికేషన్ను విడుదల చేసింది, అయితే ఇప్పటి వరకూ లేనిది వెహికల్ కు నామిని ఫెసిలిటీ తీసుకురావాలి అని చూస్తున్నారు, ఇక మీరు వెహికల్ కొన్న సమయంలో మీ పేరుతో పాటు ఓనర్ కి నామిని ఎవరు అనేది కూడా చెప్పవచ్చు.

ఇక పాత వాహనాలకి ఈ నామిని యాడ్ చేసుకునే వెసులుబాటు కూడా రానుందట, దీనిని ఆన్ లైన్ లో యాడ్ చేసుకునే సౌలభ్యం కల్పించనున్నారు,వెహికల్ ఓనర్ మరణించినప్పుడు ఆ వాహనాన్ని సులభంగానే నామినీ పేరు పైకి మార్చవచ్చు, ఒకవేళ ఆ వెహికల్ ఓనర్ మరణిస్తే అతని డెత్ సర్టిఫికెట్ సమర్పిస్తే ఆ ఓనర్ నామినీ అవుతారు.