వాహ‌న‌దారుల‌కి కేంద్రం గుడ్ న్యూస్

వాహ‌న‌దారుల‌కి కేంద్రం గుడ్ న్యూస్

0
91

ఈ లాక్ డౌన్ వేళ ర‌వాణా రంగం చాలా దారుణ‌మైన స్దితిలో ఉంది, ఎలాంటి ఎగుమ‌తులు దిగుమ‌తులు కూడా లేక‌పోవ‌డంతో ఇప్పుడు ఆ రంగం సంక్షోభంలో ఉంది అని చెప్పాలి, అయితే ట్యాక్సులు కూడా క‌ట్ట‌లేని స్దితిలో ఉన్నాము అని చెబుతున్నారు ఈ రంగంలో ఉన్న వ్యాపారులు.

ఇక తాజాగా ఇలాంటి రంగంలో ఉన్న వారికి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. మోటారు వాహన పత్రాల చెల్లుబాటు తేదీని ఈ ఏడాది సెప్టెంబరు 30 వరకు పొడిగిస్తున్నట్టు కేంద్ర రహదారి రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. దీంతో వాహ‌న‌దారులు చాలా ఆనందంగా ఉన్నారు.

ఇప్పటికే అన్నీ స్టేట్స్ కు కేంద్ర పాలిత ప్రాంతాల‌కు తెలిపారు, ఇక ర‌వాణాశాఖ‌కు సంబంధించి
ఫిట్‌నెస్, పర్మిట్ , డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ సహా లాక్‌డౌన్ కారణంగా మంజూరు చేయలేకపోయిన ఇతర పత్రాల చెల్లుబాటును పొడిగించడం ఇది రెండోసారి. మార్చి నుంచి జూన్ వ‌ర‌కూ ఇచ్చారు ఇప్పుడు దీనిని సెప్టెంబ‌ర్ వ‌ర‌కూ పొడిగించారు.