ఈటల జమున వి దురహంకార మాటలు : కృష్ణమోహన్ స్ట్రాంగ్ రియాక్షన్

etala jamuna reddy vs Vakulabharanam Krishna Mohan Rao Vakulabharanam Krishna Mohan Rao fire on etala jamuna reddy Vakulabharanam Krishna Mohan Rao alleges etala jamuna reddy

0
91

మాజీ బిసి కమిషన్ సభ్యుడు వకులాభరణం కృష్ణ మోహన్ పై మాజీ మంత్రి ఈటల రాజేందర్ సతీమణి ఈటల జమున ఆదివారం ఉదయం తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఎంగిలిమెతుకుల జీవితం కృష్ణమోహన్ ది అని… ఆయనను చూస్తే ఒక్క ఓటు కూడా పడవని అన్నారు. దానికి కృష్ణ మోహన్ అంతే స్థాయిలో రియాక్ట్ అయ్యారు. జమునా రెడ్డిని ఉద్దేశించి ఘాటైన ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఆ ప్రెస్ నోట్ ను యాజిటీస్ గా కింద ఇస్తున్నాము.

నాపై ఈటల జమున వ్యాఖ్యలు దురహాంకారానికి పరాకాష్ట

ఉద్యమ నేతగా నేను బడుగులకు స్కీమ్‌లు పెట్టించాను
మంత్రిగా ఈటల బడుగుల భూములు లాక్కొని స్మామ్‌లు చేశారు
ఈటల జమున ఆరోపణలు బట్ట కాల్చి మీద వేయడం లాంటిదే
నా జీవితం స్పటికంలా పారదర్భ్శకమైంది
ఈటల జీవితం అక్రమాస్తులకు నెలవైంది
ఎంగిలి మెతుకులు తినే జీవితం నాది కాదు
నోటి కాడి బుక్కను లాక్సునే జీవితం మీది
నాపై నిందలు మీ కుట్రపూరిత మనస్తత్వానికి నిదర్శనం
-దాక్టర్‌ వకుళాభరణం కృష్ణమోహన్‌ రావు

మాజీమంత్రి ఈటల రాజేందర్‌ బర్తరఫ్‌ దరిమిలా జరుగుతున్న రాజకీయ పరిణామాల్లో భాగంగా
తొలిసారిగా ఈటల సతీమణి జమునా రెడ్డి ఆదివారం నాడు మీడియా ముందుకు వచ్చి నాపై చేసిన
అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నాను. ఈ వ్యాఖ్యలు ఈటల దంపతులు ఇన్నాళ్ళుగా వల్లిస్తున్న
ఆదర్శ్భభావాలు, ఆదర్శ జీవితం, కులరహిత సమాజం, ప్రజలందరూ సమానమే అనేవి ఉత్త కహానీలే
అని తేలిపోయింది. దశాబ్దాలుగా తెలుగు సమాజంలో బిసి ఉద్యమ నేతగా మంచి గుర్తింపును
తెచ్చుకున్న నాలాంటి వాడిపై జమున వ్యాఖ్యలు ఆమెలోని దురహంకారాన్ని ధన అహంకారాన్ని
స్పష్టం చేస్తున్నాయి. ఈటల నిజరూపం బయటపడ్డాక సాధికారికంగా నేను రాసే వ్యాసాలు, ఆయనపై
నా వ్యాఖ్యలు సహించలేక, బట్టకాల్చి మీద వేసే ప్రయత్నం వారి అపరిచిత మనస్తత్వానికి నిదర్శనం.
దుర్మార్గమైన ఆరోపణ ఏమిటంటే నా కుటుంబాన్ని దీరేదో నెల నెల ఖర్చులు ఇచ్చి ఆదుకుంటున్నట్లు
చెప్పడం ఇంతకన్నా అమానవీయం, నిర్లజ్ఞాతనం మరొకటి లేదు.

నిజంగా అలాంటి ఉదార స్వభావం మీలో వుంటే, మీ ద్వారా ఎంతమంది బాగుపడ్డారో, ఎన్ని
కుటుంబాలను నిలబెట్టగలిగారో చెప్పడం సాధ్యమా? మీరే అంతటి ఉన్నత భావాలు కలిగినవారైతే
ఈరోజు మీ వెంబడి నియోజకవర్గంలోని ఒక్క ప్రజాప్రతినిధి లేకపోవడానికి కారణమేమై ఉంటుంది.
ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలుస్తూ వస్తున్న ఈటల వెంబడి ఒక్కరంటే ఒక్కరు లేకపోవడం ఇంతకన్నా
అవమానం మరేముంటుంది. పైగా మేము ఆదర్శవంతులమని చెప్పుకోవడం ఆత్మహత్యా సద్భశ్యం.
ఒక్కటి మాత్రం స్పష్టంగా చెప్పగలను. నేను విద్యార్థి దశ నుండి ఉద్యమ జీవితం గడుపుతూ రాజకీయాల్లోకి
వచ్చాను. నిరంతరం ప్రజల గొంతుకగానే నా జీవితం కొనసాగుతున్నది. మీరు వ్యాపారాల నుండి
రాజకీయాల్లోకి వచ్చారు. రాజకీయాలను కూడా వ్యాపారమయం చేశారు. నాడు బిసి నేత ఆర్‌.
కృష్ణయ్య నేతృత్వంలో పోరాటాల ద్వారా ఆ వర్గాలకు అనేక “స్మమాలు పెట్టించగలిగాం. అలానా
జీవితం పారదర్శకమైంది, త్యాగమయమైంది. మీరేమో వ్యాపారాల నుండి వచ్చారు. రాజకీయాలను,

అధికారాన్ని అడ్డం పెట్టుకొని “స్మామొలు చేశారు, ఇది మీ జీవితం. మీరేదో సచ్చీలురు అయినట్లు
మాట్లాడితే వాస్తవాలు-అవాస్తవాలు కావు. ఈ నిజం తెలుసుకోండి.

ఎంగిలి మెతుకులు తినాల్సిన అగత్యం నాకు లేదు. నా జీవితమే ఆత్మ గౌరవంతో,
ఆత్మాభిమానంతో ముడిపడి వుంది. కాగా నేడు మీరు వల్లిస్తున్న ఆత్మ గౌరవం, ఆత్మాభిమానం,
సామాజిక కోణం, కేవలం మీ అక్రమ ఆస్తులు కాపాడుకోవడానికి మాత్రమే. ఈ విషయం ప్రజలందరి
గమనంలో వుంది. “మా ఇంటిలో పొయ్యి ఎప్పుడూ వెలుగుతూనే ఉంటుందని రాజేందర్‌ గారు
చెబుతున్నప్పుడు ఎంత గొప్పవారో అనుకున్నాం”. నేడు మా ఇంటికి వచ్చి తిని పోయిందని వచ్చి
పోయిన వారిని అవమానిస్తూ మాట్లాడుతున్నారు. మీ దృష్టిలో బలహీన వర్ణాలు అంటే ఇంత
చులకననా? తిండి తిని పోయేవారిలా చూస్తున్నారా? బలహీన వర్గాలంటే తిండి పారేస్తే తిని పోయే
వారనే అభిప్రాయమా? మీ మనస్సులో ఇంత సంకుచితత్త్రం ఉందని తెలిస్తే ఎవరూ మీ ఇంటికి
రాకపోయేవారు కదా! ఎందుకంటే బలహీనవర్గాలకు ఆత్మాభిమానమే ప్రధానం. తింది లేకున్నా
పస్తులు పంటాం. మాకు ఉంటే నలుగురికి పెట్టి తింటాం. ఇటువంటి కొంచెపు బుద్ధులు మాకుందవు.
కోట్లు వున్నామీది కొంచపు బుద్ధి. మా ఆత్మాభిమానం సహజంగా ఉంటుంది. “మీ డబ్బు, అధికారం
మా ఆత్మాభిమానం ముందు ఎందుకూ పనికిరాదు. పైగా ఎవరిని కోసి చూసినా రక్తం ఎరుపుగానే
ఉంటుంది అంటున్నారు. మాకు ఏ వర్గాలపై వివక్షత లేదంటున్నారు. మరోవైపు బహిరంగంగానే
అవమానిస్తున్నారు. నాలాంటి వారిపై మీ కువిమర్శలు మీ మనస్తత్వాన్ని మీ ఫ్యూడల్‌ వ్యవహార శైలిని
స్పష్టం చేస్తున్నాయి. నిగూఢంగా ఉన్నమీ అసలు రూపాన్ని ప్రజలు ఏనాడో గమనించారు. అందుకే
నేడు మీ వెంట ఎవరూ రావడం లేదు.

2004 సంవత్సరంలో ఈటల రాజేందర్‌, నేను ఒకేసారి రాజకీయ జీవితం ప్రారంభించాం.
ఆయన వ్యాపారాలు చేస్తూ రాజకీయాల్లోకి వచ్చారు. నేను బిసిల హక్కుల నేతగా ఉద్యమ జీవితం
నుండి కొనసాగింపుగా రాజకీయాల్లోకి వచ్చాను. 2004 లోనే దేశంలోనే అతి చిన్న వయస్సులో
బిసి కమిషన్‌ సభ్యుడిగా నియామకమయ్యాను. ఈటల అందివచ్చిన అవకాశంతో ఎమ్మెల్యే కాగలిగారు.
రాజకీయాల్లోకి వచ్చిన తరువాత కూడా ఈటల వ్యాపారాలు చేసుకుంటూనే ఉన్నారు. నేను ప్రజాసేవ
కొనసాగిస్తూనే ఉన్నాను. 2009 సాధారణ, 2010 ఉప ఎన్నికలలో ఈటలపై రెందుసార్లు కాంగ్రెస్‌
పార్టీ నుండి పోటీ చేశాను, పరాజయం పాలయ్యాను. 2009 ఎన్నికలలో కేవలం 15 వేల స్వల్ప
తేడాతో ఓటమిని చవి చూశాను. ఆ ఎన్నికలలో నా మెజారిటీని చూసి ఈటల ఖంగుతిన్నారు.
అప్పుడు ఈ వకుళాభరణం ముఖానికే అన్ని ఓట్లు వచ్చాయి. ఇప్పటి వరకు ఈటలపై అంతగా గట్టి
పోటీని ఎవరూ ఇవ్వలేకపోయారు. 2009 ఎన్నికలు నాకు చీకటి రోజులని సంవత్సరాల తరబడి
చెప్పుకొని బాధపడుతుందేవాడు. ఈ విషయం తెలిసి కూడా ఈటల జమున ఈ వకుళాభరణం
ముఖం చూసి ఎవరైనా ఓట్లు వేస్తారా అని మాట్లాడడం హాస్యాస్పదం. ప్రస్తుతం నేను టిఆర్‌ఎస్‌
అభ్యర్థిని నేనే అని ఎక్కడా చెప్పుకోలేదు. వం నుండి ఎలాంటి సంకేతాలు లేవు. అయినప్పటికీ నాపై
ఇంతగా తక్కువ చేసి విమర్శించడం ధన గర్వం కాక మరేమవుతుంది. జమున చేసిన వ్యాఖ్యలు
ఆమెలోని అవివేకాన్ని స్పష్టం చేస్తున్నాయి. మరి 2018 ఎన్నికలలో నా పూర్తి సహకారాన్ని రాజేందర్‌

ఎందుకోసం తీసుకున్నారు. నెలన్నర రోజులపాటుగా హుజూరాబాద్‌లోనే పూర్తిన్ధాయి మకాం వేసి
ఈటల గెలుపు కోసం నాదైన పద్ధతిలో చేసిన కృషిని ఎన్నోసార్లు ఆయన ఎలా అభినందించగలిగారు.
ఇది వాస్తవం. కాగా పనీ పాటా లేకుండా నేను తిరుగుతా ఉంటే… ఈటల నాపై అభిమానాన్ని
ప్రదర్శించి తెలంగాణ ప్రభుత్వంలో బిసి కమిషన్‌ సభ్యుడిగా నియామకం చేయించడం ద్వారా
గుర్తింపు వచ్చిందని చెప్పడం అజ్ఞానం కాక మరేమవుతుంది.

నా జీవితంలో ఒక్క విషయాన్ని మాత్రం గొప్పగా చెప్పుకుంటాను. అది 2004 సంవత్సరంలో
కేప్టెన్‌ వి.లక్ష్మికాంతరావు (ప్రస్తుత రాజ్యసభ సభ్యులు) నాడు బిసి మంత్రిగా సిఫారసు చేసి నన్ను బిసి
కమిషన్‌ సభ్యుడిగా నియామకం చేయించారు. క్రమంగా నిబద్ధతతో పని చేస్తూ, నాటి ముఖ్యమంత్రి
మన్ననలతో ఎమ్మెల్యే బి-ఫారం పొంది పోటీ చేయగలిగాను. పూజయంతో క్రుంగిపోకుండా నాదైన
పద్ధతిలో బిసి హక్కుల కోసం నిరంతరం పని చేస్తుందడం జీవితంలో ఒక భాగం చేసుకున్నాను.
నాడు కాంగ్రెస్‌ పార్టీలో కూదా తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో క్రియాశీలంగా పాల్గొన్నాను.
పార్టీ అధికార ప్రతినిధిగా టి.వి. చర్చలలో తెలంగాణ వాదాన్ని బలంగా వినిపించాను. కానీ నేను
ఏనాడూ వ్యక్తిగతంగా ఆస్తులు ‘పెంచుకోలేదు సరికదా, ఆస్తులు కోల్పోయాను, అప్పుల పాలయ్యాను.
ఇది ముమ్మాటికి వాస్తవం. అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఈటల బడుగుల భూములు గుంజుకున్నారు.
నేను అధికారంలో ఉన్నా లేకున్నప్పటికి బిసి వర్ణాల సమగ్ర వికాసానికి కృషి చేస్తూనే వున్నాను.
2016 లో నా సేవలను గుర్తించి ముఖ్యమంత్రి కెసిఆర్‌ తెలంగాణ తొలి బిసి కమిషన్‌లో సభ్యుడిగా
నియామకం చేశారు. ఆ పదవిలో కూడా నా వర్ణాల అభ్యున్నతికి చిత్తశుద్ధిగా కృషి చేయడం
జరిగింది. ఈటల రాజేందర్‌కు నిజంగానే పదవులు ఇప్పించగలిగే శక్తే వుంటే ఇప్పటి వరకు
హుజూరాబాద్‌ నియోజకవర్గం నుండి రాష్ట్రస్థాయిలో ఎంతమందికి పదవులు ఇప్పించారు.
నియోజకవర్గంలోని నాయకులకు ఇదిగో-అదిగో అంటూ కాలం వెళ్లబుచ్చారు తప్ప ఒక్కరికైనా
పదవి ఇప్పించగలిగారా సమాధానం చెప్పాలి.

మీ అక్రమ ఆస్తులపై దర్యాస్త జరుపుతుంటే, మీరు జరుపకూడదంటూ గగ్గోలు పెడుతున్నారు.
నేను ఏమైనా అక్రమాస్తులు సంపాదించి వుంటే, ఆస్తులు పెంచుకొని వుంటే దర్యాస్త జరుపవలసిందిగా
డిమాండ్‌ చేస్తున్నాను. ఇది వాస్తవం.

మీరు ప్రతిసారి కెసిఆర్‌ బొమ్మ పెట్టుకొని గెలిచారు.

ఇప్పుడు పదిహేదేండ్లు ఎమ్మెల్యేగా, ఏదేండ్లు మంత్రిగా ఉన్న తరువాత కూడా మీ బొమ్మ చూసి
ఓట్లేసే దిక్కులేదు. అందుకే కాంగ్రెస్‌, బిజెపి నాయకుల చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నారు.

టిఆర్‌ఎస్‌ నుండి ఎవరికి టికెట్‌ ఇచ్చినా కెసిఆర్‌ బొమ్మ పెట్టుకొని గెలుస్తాం. దమ్ముంటే
రాజీనామా చేసి ఎన్నికల బరిలోకి దిగుమని సవాల్‌ చేస్తున్నాం.

బలహీన వర్గాల సమున్నతికి మీరు చేసింది ఏమిటో మీ మనస్సాక్షికి తెలుసు. రేపటి ఎన్నికలలో
బలహీన వర్గాలే మీ అహంకారాన్ని వదలదీసి బుద్ధి చెబుతారు. ఇది రేపటి వాస్తవం.