ఏపీ ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆ పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రెండు వారాలు పూర్తి అవుతున్నా ఆయన ఇంతవరకు ఏ పార్టీలో చేరలేదు….
ఎన్నికల సమయంలో నకిలీ పత్రాలను పంపిణీ చేశారనే ఉద్దేశంతో ఆయనపై కేసు నమోదు అయింది… దీంతో గన్నవరం రాజకీయాలు శరవేగంగా మారుతూ వచ్చాయి.. అనుకోని విధంగా ఆయన్ను బాల్య మిత్రుడు కొడాలి నాని అలాగే పేర్ని నాని కలవడం అదే రోజు జగన్ మోహన్ రెడ్డిని కలిశారు…
దీంతో అందరు ఆయన పార్టీ మారుతారని భావించారు… పార్టీ మారేందుకే జగన్ తో మీట్ అయ్యారని వార్తలు వచ్చాయి… అయితే పార్టీ రూల్స్ అండ్ రెగ్యూలేషన్ ప్రకారం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రావాలి అదికూడా చేశారు వంశీ… కానీ టీడీపీ దాన్ని ఆమోదించకుంది… ఒక వేల ఆయన పార్టీలో చేరితే అనర్హత వేటు వేసే అవకాశం ఉంది… అందుకే వైసీపీ అవకాశం కోసం ఎదరుచూస్తోంది…