Flash: జైలు నుంచి వనమా రాఘవ విడుదల

0
84

పాల్వంచలో రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో రాఘవ రెండు నెలలు జైల్లో ఉన్నాడు. తమ కుటుంబం బలవన్మరణానికి కారణం వనమా రాఘవ అంటూ రామకృష్ణ తీసుకున్న సెల్ఫీ వీడియో అప్పట్లో ప్రకంపనలు సృష్టించింది. తాజాగా వనమా రాఘవ జైలు నుంచి విడుదలయ్యాడు. రాఘవకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు.. అయితే కొత్తగూడెం నియోజకవర్గంలో అడుగుపెట్టొద్దని కోర్టు స్పష్టం చేసింది.