జగన్ ని మళ్లీ టార్గెట్ చేసిన వంగవీటి రాధా

జగన్ ని మళ్లీ టార్గెట్ చేసిన వంగవీటి రాధా

0
93

తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్న వంగవీటి రాధా ఎన్నికల ముందు వైసీపీకి గుడ్ బై చెప్పి తెలుగుదేశం పార్టీలోకి చేరిపోయారు, అయితే పార్టీలో ఆయన కొనసాగుతున్నా ఈ మధ్య అంత యాక్టీవ్ గా లేరు, కాని తాజాగా రాజకీయంగా ఆయన పార్టీ మారిపోతారు అని వార్తలు వినిపించాయి, కాని ఇటీవల ఆయన బాబు నివాసానికి కూడా వెళ్లారు, దీంతో రాజకీయంగా ఆయన టీడీపీలోనే ఉంటారు అని తేల్చారు.

తాజాగా ఏపీ రాజధాని అమరావతి కోసం తుళ్లూరులో రైతుల దీక్షలు కొనసాగుతున్నాయి. ఇక్కడకు టీడీపీ నేత వంగవీటి రాధా తుళ్లూరులో రైతుల ధర్నాకు సంఘీభావం ప్రకటించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట నెగ్గించుకోవడానికి జగన్ ఎంతవరకైనా వెళతాడని వ్యాఖ్యానించారు.

ఇప్పుడు శాసనమండలి రద్దు అంశం కూడా ఈ కోవకే చెందుతుందని తెలిపారు. దిగువ సభలో పొరబాట్లకు తావులేకుండా పెద్దల సభ ఏర్పాటు చేశారని.. మండలి కొనసాగింపునకు మద్దతు తెలిపారు. రైతులకి తమ మద్దతు ఉంటుంది అని ఇది కేవలం ఇక్కడ వారి సమస్య కాదు అందరి సమస్య అని అన్నారు ఆయన.