వరుస అరెస్టులతో…..అమరావతిలో సీఐడీ జోరు….

వరుస అరెస్టులతో.....అమరావతిలో సీఐడీ జోరు....

0
86

అమరావతిలో వరుస అరెస్టుల పర్వం….. అధికారులు రైతులతో పాటు బడాబాబుల గెండెల్లో నూ రైళ్లు పరిగెత్తిస్తోంది… అప్పట్లో అమరావతి రాజధానికాగానే అందినంతవరకు దోచుకున్న అధికారుల భాగోతాన్ని సీఐడీ అధికారులు బయట పెడుతుండటంతో కొందరు అధికారులు అప్రూవర్లుగా కూడా మారేందుకు సిద్దమవుతున్నారు ఇప్పటికే ఈ కేసులో ముగ్గురిని అరెస్ట్ చేసిన సీఐడీ త్వరలో అరెస్టు చేసే మరికొందరి జాబితాను సిద్దం చేస్తున్నట్లు తెలుస్తోంది…

అమరావతి భూముల్లో రాజధాని పేరుతో జరిగి క్రయవిక్రయాలపై దర్యాప్తు జరుపుతున్న సీఐడీ చురుగ్గా కదులుతోంది… ఇప్పటికే అసైండ్ భూముల అక్రమాలతో పాటు అక్రమ కేటాయింపులపైనా తగిన అధారాలు సంపాదించిన సీఐడీ అధికారులు సీఆర్టీఏ డిప్యూటీ కలెక్టర్ మాధురిని అరెస్ట్ చేశారు…తాజాగా ఆమె వద్ద పనిచేసినకంప్యూటర్ అపరేటర్ రణధీన్ కూడా అరెస్ట్ చేశారు… అదంతా అక్రమ కేటాయింపుల వ్యవహారంలో భాగంగా మాత్రమే…

అప్పట్లో జరిగిన మరిన్ని అక్రమ కేటాయింపులతో పాటు సైండ్ భూముల వ్యవహారంలో పాలుపంచుకున్న అందరినీ బయటకి లాగాలనేది సీఐడీ ఆలోచనగా కనిపిస్తోంది… గత టీడీపీ ప్రభుత్వ హయాంలో సీఆర్ఢీఏ కమిషనర్ గా పని చేసిన చెరుకురి శ్రీధర్ ఆమరావతి భూములు ప్లాట్లు కేటాయింపులతో పాటు ఇతరత్రా వ్యవహారాల్లోనూ కీలకంగా వ్యహరించారు…

అప్పట్లో ఆయన చెప్పినట్లు నుడుచున్న సీఆర్డీఏ అధికారులనే సీఐడీ ఇప్పుడు వరుసగా అరెస్టులు చేస్తోంది… వారిని ప్రశ్నిస్తున్న సందర్భంలో వీరంతా భూ కుంభకోణంలో తమ పాత్రేమిలేదని ఉన్నతాధికారులు అప్పటి టీడీపీ మంత్రి, పేషిల నుంచి వచ్చిన ఫోన్ల ఆధారంగానే తాము ఆ నిర్ణయాలు తీసుకున్నామని అవసరమైతే అప్రూవర్లుగా మారిసీఐడీకి కావాల్సిన సమాచారాన్ని ఇస్తామని చెబుతున్నట్లు తెలిసింది.