వారందరికి సీఎం కేసీఆర్ గిఫ్ట్ – మంచి నిర్ణయమంటున్న జనం

వారందరికి సీఎం కేసీఆర్ గిఫ్ట్ - మంచి నిర్ణయమంటున్న జనం

0
100

తమ ప్రాణాలు పణంగా పెట్టి కరోనా పేషెంట్లకు చికిత్స అందిస్తున్నారు వైద్యులు.. ప్రపంచ దేశాల్లో ఇదే జరుగుతోంది, నిజంగా వారికి చేతులెత్తి మొక్కాలి. ఈ సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు, అందరూ దానికి ఆయనని ప్రశంసిస్తున్నారు.

ఇప్పటికే వారు చేస్తున్న పనికి వైద్యశాఖ సిబ్బందికి పూర్తి వేతనమివ్వాలని చెప్పాం అన్నారు కేసీఆర్ . వారి సేవలకు గుర్తుగా, సిఎం గిఫ్ట్ కింద వాళ్లందరికీ 10శాతం గ్రాస్ శాలరీనిస్తున్నాం. ఆర్ధిక కార్యదర్శితో మాట్లాడాం. వాళ్లకు వెంటనే డబ్బు అందచేస్తాం అని గుడ్ న్యూస్ చెప్పారు, రేపు లేదా ఎల్లుండి వారికి నగదు జమ అవుతుంది అన్నారు. ఇక తెలంగాణలో పోలీసులు బాగా పనిచేస్తున్నారు వారికి ధన్యవాదాలు తెలిపారు ఆయన.

అంతేకాదు ఇలా గ్రామాలు పట్టణాలు నగరాలు శుభ్రంగా ఉన్నాయి అంటే అదంతా పారిశుధ్యపు డిపార్ట్ మెంట్ ఉద్యోగుల చలువే, వారు మన రాష్ట్రాన్ని చాలా బాగా ఉంచుతున్నారు, వారు చేసే పనికి సలాం అన్నారు..సఫాయి కర్మచారిలు చేసే సేవ వెలకట్టలేనిది అన్నారు ఆయన, వీళ్లకి మొన్న జీతాల్లో కోత ఉంది కాని అది కూడా క్లియర్ చేస్తాం అన్నారు సీఎం కేసీఆర్.

అలాగే ప్రత్యేక ప్రోత్సాహ నిధి కింద GHMC, HMWS సిబ్బందికి రూ.7500 ప్రత్యేక ప్రోత్సాహకంగా ఇస్తాం అన్నారు. మున్సిపాలిటీలు, గ్రామ పారిశుద్ధ్య కార్మికులకు రూ.5000 చొప్పున ఇస్తాం అన్నారు. సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం పై అందరూ హ్యాట్సాఫ్ చెబుతున్నారు.