వారికి 5 వేలు – సీఎం జ‌గ‌న్ మ‌రో కీల‌క నిర్ణ‌యం

వారికి 5 వేలు - సీఎం జ‌గ‌న్ మ‌రో కీల‌క నిర్ణ‌యం

0
84

ఏపీలో క‌రోనా కేసులు భారీగా న‌మోదు అవుతున్నాయి, టెస్టులు కూడా భారీగా చేస్తోంది ఏపీ స‌ర్కార్, అయితే ఇక్క‌డ దాదాపు ల‌క్ష కేసులు దాటాయి, ఇక క‌రోనా సోకిన వారికి ఉచితంగా చికిత్స అందిస్తున్నారు వైద్యులు, ప్ర‌భుత్వం వారికి అన్ని విధాలుగా సాయం చేస్తోంది.

శుక్రవారం కరోనా నివారణపై సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి సమీక్షను నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా బాధితులను ఆదుకునేందుకు ముందుకొచ్చే ప్లాస్మా దాతలకు రూ.5వేలు ఇవ్వాలని నిర్ణయించారు.

అంతేకాదు ఇలా ప్లాస్మా థెర‌పీ పై అవ‌గాహ‌న క‌ల్పించాలి అని అధికారుల‌కి తెలిపారు, ఇక మందుల విష‌యంలో కూడా ఎక్క‌డ ఎవ‌రికి అవ‌స‌రం అయినా అన్నీ ఆస్ప‌త్రుల‌కి వెళ్లాలి అని తెలిపారు, మందులు అందుబాటులో ఉండేలా చూడాలి అని సీఎం జ‌గ‌న్ తెలిపారు.
కరోనా చికిత్స కోసం గుర్తించిన ఆస్పత్రుల్లో బెడ్ల ఖాళీలు, భర్తీల వివరాలు ఆస్పత్రి హెల్ప్‌ డెస్క్‌లో అందుబాటులో ఉంచాలని సూచించారు.