తెలంగాణలో కేసుల సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది, ఈ సమయంలో కేంద్రం ఇచ్చిన సడలింపుల్లో భాగంగా అన్నీ రకాల వ్యాపారాలు ప్రభుత్వ కార్యాలయాలు ప్రైవేట్ ఆఫీసులు తెరచుకున్నాయి, అయితే ఈ సమయంలో చాలా మందికి జీతాలు రాక ఇబ్బంది పడ్డారు.
ఇప్పటికే మార్చి 25 నుంచి వివిధ దశల్లో లాక్ డౌన్ విధిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం జూన్ 30 వరకు లాక్ డౌన్ అమలులో ఉంది. ఇక ప్రభుత్వ ఉద్యోగులకు కూడా పూర్తి జీతాలు అయితే ఇవ్వలేదు,ప్రభుత్వానికి ఆదాయం లేకపోవడంతో కోతలు విధించింది. ఏప్రిల్, మే నెలల్లో అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల జీతాల్లో కోతలు పడ్డాయి.
అయితే ఇప్పుడు వారికి గుడ్ న్యూస్ చెప్పారు సీఎం కేసీఆర్, జూన్ నెల నుంచి ఉద్యోగులకు పూర్తి జీతాలు రానున్నాయ, అలాగే పెన్షనర్లకు కూడా పూర్తి పెన్షన్ జూన్ నుంచి ఇవ్వనున్నారు, ఇక గత రెండు నెలల జీతాల బకాయిలు సాధారణ పరిస్దితులు వచ్చిన తర్వాత చెల్లించనున్నారు.