ఏదైనా సంఘటన జరిగితే అందులో వాస్తవాలు ఏమిటి ఫ్యాక్ట్ అనేది తెలుసుకోకుండానే చాలా మంది వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తారు, ఇక పెద్ద ఎత్తున ఇలాంటి వార్తలు సోషల్ మీడియాలో వైరస్ అవుతూ ఉంటాయి, దీనిపై ప్రభుత్వాలు సీరియస్ అయిన సంఘటనలు ఉన్నాయి.
ఇప్పుడు పెద్ద విపత్కర స్దితి కరోనా… ఈ సమయంలో కూడా కొందరు సోషల్ మీడియాలలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు, అలాంటి వారిపై సీఎం కేసీఆర్ తీవ్ర విమర్శలు చేశారు..సోషల్ మీడియాలో కావాలని పని గట్టుకొని తప్పుడు వార్తలను వాట్సాప్, ఫేస్‌బుక్, ట్విట్టర్ ద్వారా ప్రచారం చేస్తున్నారని, వారి పని పడతామని కేసీఆర్ హెచ్చరించారు.
ఇలాంటి వారిని చాలా కఠినంగా శిక్షిస్తామని అన్నారు. సోషల్ మీడియాలో గానీ, ఇతర మీడియాల్లో గానీ దుర్మార్గమైన ప్రచారాలు చేసే వాళ్లకు భయంకరమైన శిక్షలు విధిస్తామని చెప్పారు. ఆ శిక్షలు ఎలా ఉంటాయో తాను చూపిస్తానని, తాము గొప్పవాళ్లం, ఎవరూ పట్టుకోలేరన్న అనుకుంటున్న మూర్ఖులకు ఇదే తానిచ్చే హెచ్చరిక అని స్పష్టం చేశారు. అలాంటి వారికి తాము కచ్చితంగా గుణపాఠం చెబుతామని ప్రజలని భయపెట్టాలని చూస్తున్నారని ఆయన విమర్శించారు.