ట్రంప్ రాకపై వర్మ సటైర్ గొప్ప సలహ

ట్రంప్ రాకపై వర్మ సటైర్ గొప్ప సలహ

0
74

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండు రోజులు భారత పర్యటనకు వస్తున్నారు… అయితే ఏర్పాట్లు మాత్రం ఓ లెవల్లో చేస్తున్నారు, దీనిపై చాలా మంది ఇప్పటికే అనేక కామెంట్లు చేస్తున్నారు.. ఏకంగా కోటి మంది వెల్ కం చెప్పడం ఏమిటి అని ఆలోచన చేస్తున్నారు, అయితే మోదీ సర్కార్ మాత్రం చాలా పెద్ద ఏర్పాట్లే ట్రంప్ రాకకై చేస్తోంది.

తాజాగా ట్రంప్ మాట్లాడుతూ, భారత్ లో తనను ఆహ్వానించేందుకు మిలియన్ల మంది ప్రజలు వస్తారని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో సటైరిక్ గా ట్వీట్ చేశారు. ఇప్పుడు ఈ ట్వీట్ వైరల్ అవుతోంది, అంతేకాదు చర్చ కూడా వర్మపై జరుగుతోంది.

ఇండియాలో ట్రంప్ ను 10 మిలియన్ల ప్రజలు ఆహ్వానించాలంటే ఒకటే దారి ఉంది. ట్రంప్ పక్కన అమితాబ్ బచ్చన్, సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్, షారుఖ్ ఖాన్, రజినీకాంత్, కత్రినా కైఫ్, దీపికా పదుకునే, సన్నీ లియోన్ లను నిల్చోబెడితే అది సాధ్యమే’ అంటూ వర్మ చమత్కరించారు. వర్మ ట్వీట్ పై నెటిజెన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. కేఏ పాల్, మెగాస్టార్, పవన్ కల్యాణ్ లను మర్చిపోయారంటూ కొందరు రీట్వీట్ చేశారు. మరి నిజంగా కోటి మంది వస్తారా అనేది చూడాలి.