వారందరికీ ఈ నెల పండగే పండగ

వారందరికీ ఈ నెల పండగే పండగ

0
92

సంవత్సర కాలంలో రైతులు మృగశిర కార్తి కోసం ఎదురు చూస్తుంటారు ఈ కార్తి వర్షాదార పంటలను వేసుకునే రైతులు తమ భూములను సిద్దం చేసుకోవడం, విత్తనాలను సరిచూసుకోవడం వంటివి జరుగుతుంటాయి ఈ కార్తికి ఓ ప్రత్యేకత ఉంది… జూన్ నెలలో వచ్చే ఈ కార్తిలో చేపలు తినడం అలవాటు రోళ్లు పగిలే ఎండలతో ఉన్న రోహిణి కార్తి పోయి చల్లబడే మృగశిర కార్తి ప్రారంభమవుతుండ దృష్ట్యా ఈ కార్తిలో రైతులువరి విత్తనాలు కొనుగోలు చేసి నార్లు పోసుకుంటారు…

ఈ కార్తిలో వేసిన పంటబాగా వస్తుందని రైతులనమ్మకం వర్షాదార పంట వేరుశెనగ వేసుకునే రైతులు ఈ కార్తి కోసం ఎదురు చూస్తుంటారు… ఇప్పుడే నైరుతి రుతుపవనాలు ఆగమనం అవుతుంది దీంతో ఎండలు పోయి చల్లదనం వస్తుంది ఈ కార్తిలోనే ఉబ్బసం, దగ్గు ఉన్నవారు చేపమందు తింటే పోతుందని బలమైన నమ్మకం ఉంది… అశ్వని మొదలు కొనిరేవతి వరకు ఉన్న 27 నక్షత్రాల్లో సూర్యుడి ప్రవేశం ఆదారంగా జ్యోతిష్యులు కార్తులు నిర్ణయించారు…

ఒక్కోక్క కార్తి ప్రత్యేకత ఉన్న ఈ మృగశిర కార్తికి మాత్రం ఎనలేని కీర్తి ఉంది మృగశిర నక్షత్రంలో ప్రవేశించిన నాటి నుంచి నైరుతి రుతుపవనాలు రావడం ప్రకృతి అనేక మార్పులు చేసుకుంటుందని పలువురి అభిప్రాయం మృగశిర కార్తిలో అనేక కరాల సూక్ష్మజీవులు పునరుత్పత్తి అయిమానవుని రోగ నిరోదక శక్తి తగ్గే అవకాశాలు ఉన్నాయి… దీంతో దగ్గు జలుబు వంటి వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్న దృష్ట్య తగు జాగ్రత్తలు పాటించాలని పలువురి అభిప్రాయం….