కూర‌గాయ‌ల వ్యాపారుల‌కి క‌రోనా ఎంత మందికో తెలిసి షాకైన వైద్యులు

కూర‌గాయ‌ల వ్యాపారుల‌కి క‌రోనా ఎంత మందికో తెలిసి షాకైన వైద్యులు

0
98

వాళ్లంద‌రూ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ కూర‌గాయ‌లు అమ్ముకుంటూ జీవిస్తున్నారు, అయితే ఈ వైర‌స్ వారిపై పంజా విసిరింది, ఏకంగా 28 మంది కూర‌గాయ‌లు అమ్మేవారికి వైర‌స్ సోకింది, దీంతో అంద‌రూ షాక్ అయ్యారు.. వారి కుటుంబాల‌ని క్వారంటైన్ కి త‌ర‌లించారు. వారికి చికిత్స అందిస్తున్నా‌రు వైద్యులు.

ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రా నగరంలో వెలుగుచూసింది. ఒక్క ఆగ్రా నగరంలోనే గత పదిరోజుల్లో 28 మంది కూరగాయల వ్యాపారులకు కొవిడ్-19 పాజిటివ్ అని పరీక్షల్లో తేలింది. ఇక్క‌డ కిరాణా కూర‌గాయ‌లు అమ్మేవారికి దాదాపు 160 మందికి టెస్ట్ చేస్తే వారికి పాజిటీవ్ అని తేలింది.

ఈ కూరగాయల వ్యాపారులు ఎక్కువ మంది బాసాయి, తాజ్ గంజ్ మండీల్లో కూరగాయలు విక్రయించేవారని అధికారులు చెప్పారు. దీంతో ఆ కూర‌గాయ‌లు కొన్న కుటుంబాలు కూడా ఇప్పుడు ఆందోళ‌న‌లో ఉన్నాయి, క‌చ్చితంగా ఇంటికి కూర‌లు పండ్లు తెస్తే వాటిని క‌డ‌గాలి, అవి నేరుగా ఫ్రిజ్ లో పెట్ట‌కూడ‌దు. నేరుగా వండ‌కూడ‌దు, వాటిని బాగా క‌డిగిన త‌ర్వాత మాత్ర‌మే వండుకోవాలి.