వేలాది ఒంటెలను చంపేస్తున్న ఆస్ట్రేలియా ఎందుకో తెలిస్తే కన్నీరే

వేలాది ఒంటెలను చంపేస్తున్న ఆస్ట్రేలియా ఎందుకో తెలిస్తే కన్నీరే

0
84

ఓ జంతువుని చంపడం ఎంతో పాపంగా భావిస్తాం.. ఇప్పుడు ఆస్ట్ర్రేలియా అడవుల్లో కార్చిచ్చు వల్ల సుమారు 100 కోట్ల జీవులు చనిపోయాయి అని లెక్కిస్తున్నారు.. ఈ సమయంలో మరికొన్ని జీవులని స్వయంగా చంపేస్తున్నారు అక్కడ అధికారులు. ఇది జంతు ప్రేమికులని బాధ పెడుతోంది.

మరి కాపాడాల్సిన వారే ఎందుకు చంపుతున్నారు అంటే వారు చనిపోకుండా అని చెబుతున్నారు, అవును కరవు బారిన పడిన ప్రాంతాల్లో నీటి కొరత నుంచి ప్రజలను కాపాడేందుకు సుమారు 10వేల ఒంటెలను చంపివేయాలని ఆస్ట్రేలియా ప్రభుత్వం నిర్ణయించింది. జనానికి కావాలసిన నీటిని స్టోర్ చేస్తే వాటిని తాగేస్తున్నాయట ఒంటెలు.. నీరు లేక ఆ నీరు ఒంటెలు తాగడంతో జనం నలుగురు చనిపోయారు. దీంతో ఒంటెలని చంపాలి అని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

దక్షిణ ఆస్ట్రేలియాలో అనేక గిరిజన తెగలు ఉన్న ఏపీవై అనే ప్రాంతంలో ఒంటెలను చంపేస్తున్నారు. ఈ మేరకు ఎంపికచేసిన ఒంటెలను నిపుణులు హెలికాప్టర్లలో నుంచి కాల్చి చంపుతున్నారు, మొత్తం 10వేల ఒంటెలకు ముప్పు పొంచి ఉంది. ఇప్పటికే కొన్నింటిని చంపేశారు..ఇళ్ల చుట్టూ ఏర్పరచుకున్న కంచెలను సైతం ధ్వంసంచేసి మరీ ఒంటెలు లోపలకు ప్రవేశించి నీరు తాగేస్తున్నట్లు ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. దీంతో వారు 24 గంటలలోనే ఇలా ఒంటెలపై కాల్పులు జరిపారు. ఇది జంతు ప్రేమికులని బాధిస్తోంది, చూశారుగా అవసరానికి నీరు ఎంత పని చేయిస్తుందో.