వీళ్లు మ‌నుషులు కాదు రాక్ష‌సులు క‌రోనా స‌మ‌యంలో ఉగ్ర‌దాడికి ప్లాన్ ఎక్క‌డ చేశారంటే

వీళ్లు మ‌నుషులు కాదు రాక్ష‌సులు క‌రోనా స‌మ‌యంలో ఉగ్ర‌దాడికి ప్లాన్ ఎక్క‌డ చేశారంటే

0
91

ప్ర‌పంచం అంతా ఈ వైర‌స్ తో బిక్కు బిక్కుమంటోంది… అంద‌రూ సాయం కోసం ఎదురుచూస్తున్న స‌మ‌యం.. ఈ స‌మ‌యంలో కూడా కొంద‌రు మూర్ఖులు ఉగ్ర‌వాదులు దాడుల‌కు సిద్దం అవుతున్నారు.
దేశంలో దాడులకు పాల్పడేందుకు ఉగ్రవాదులు కుట్రపన్నుతున్నారు. ఢిల్లీలోని తిహార్‌ జైలు వేదికగా ఉ‍గ్రదాడులకు ప్రణాళికలు రచిస్తున్నారు.

దీనికి సంబంధించి పోలీసులు వారి ప్లాన్ బ‌య‌ట‌పెట్టారు, ఎన్‌ఐఏ దీని గురించి పూర్తిగా సీక్రెట్ ఆప‌రేష‌న్ చేసింది.హైదరాబాద్‌కు చెందిన అనుమానిత ఉగ్రవాది తిహార్‌ జైల్లో ఖైదీగా ఉంటూ ఓ వర్గం యువతకు ఉగ్రపాఠాలు నేర్పుతున్నాడు. ఇలా యువ‌త‌ను ఉగ్ర‌వాదులు మార్చేందుకు ప్ర‌ణాళిక వేస్తున్నాడు.

ఇరాన్‌ ఖొరాసన్‌ మోడ్యూల్‌కు చెందిన జంట ఉగ్ర‌దాడుల గురించి పోలీసుల‌కు తెలిపారు, యువ‌త‌ను ఇలాంటి మార్గాల్లో మార్చేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాడు, అయితే ఇత‌నిని బ‌య‌ట‌కు వ‌దిలేది లేద‌ని దీనిపై పూర్తిగా రిపోర్ట్ సిద్దం చేస్తున్నాము అని పోలీసులు వెల్ల‌డించారు. ప‌లు ప్ర‌ముఖ ప్రాంతాల్లో దాడికి ప్లాన్ వేశార‌ట‌.