వేలూరు లోక్‌సభ స్థానం డీఎంకేదే!

వేలూరు లోక్‌సభ స్థానం డీఎంకేదే!

0
82

తమిళనాడులోని వేలూరు లోక్‌సభ స్థానానికి జరిగిన ఎన్నికల్లో డీఎంకే విజయకేతనం ఎగురవేసింది. అన్నా డీఎంకే అభ్యర్థి షణ్ముగంపై డీఎంకే అభ్యర్థి కతిర్‌ ఆనంద్‌ 8వేల పైచిలుకు ఓట్ల తేడాతో విజయం సాధించారు. సార్వత్రిక ఎన్నికలతో పాటే వేలూరు లోక్‌సభకు ఏప్రిల్‌ 18న ఎన్నిక జరగాల్సి ఉన్నప్పటికీ అక్కడ పెద్ద ఎత్తున డబ్బు బయటపడటంతో కేంద్ర ఎన్నికల సంఘం అక్కడ ఎన్నికను రద్దుచేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆగస్టు 5న వేలూరు లోక్‌సభ స్థానానికి పోలింగ్‌ నిర్వహించగా.. 28 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. అయితే, ప్రధాన పోటీ మాత్రం అధికార అన్నా డీఎంకే, డీఎంకే అభ్యర్థుల మధ్యే జరిగింది.