Vemireddy Prabhakar Reddy | వైసీపీ బిగ్ షాక్.. మరో ఎంపీ రాజీనామా.. 

-

ఎన్నికల వేళ అధికార వైపీపీకి (YCP) మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రాజ్యసభ ఎంపీ, నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి (Vemireddy Prabhakar Reddy) పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ అధినేత, సీఎం జగన్‌కి రాజీనామా లేఖ పంపించారు. “నేను నా వ్యక్తిగత కారణాల వలన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ జిలా పార్టీ అధ్యక్ష పదవికి, వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను. ఈ సందర్భంగా మీరు నాకు పార్టీలో అందజేసిన సహకారానికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను’’ అంటూ లేఖలో పేర్కొన్నారు.

- Advertisement -

అలాగే రాజ్యసభ ఎంపీ పదవికి కూడా ఆయన రాజీనామా చేశారు. ‘‘ నేను, నా వ్యక్తిగత కారణాల వలన నా రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని తెలియజేస్తున్నాను’’ అంటూ లేఖలో తెలిపారు. వేమిరెడ్డి భార్య ప్రశాంతి కూడా వైసీపీకి గుడ్ బై చెప్పారు. ప్రస్తుతం ఆమె టీటీడీలో కీలక పదవిలో ఉన్నారు. త్వరలోనే ఇద్దరు తెలుగుదేశం పార్టీలో చేరే అవకాశం ఉందని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...