ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్య నాయుడు?

Venkaiah Naidu as Presidential candidate?

0
106

రాష్ట్రపతి ఎన్నికల అభ్యర్థిగా అధికార పక్షం ఎవరిని బరిలోకి దించుతుందన్న ఉత్కంఠకు సాయంత్రం క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ మేరకు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుతో భాజపా అగ్రనేతల భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆయన నివాసంలో కేంద్ర హోంమంత్రి అమిత్​ షా, భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా, రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్ సమావేశం ఇప్పుడు ఆసక్తికరంగా మారనుంది. సాయంత్రం వరకు ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది.

మరోవైపు ప్రతిపక్షాలు తొలుత ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ పేరును ప్రస్తావించగా ఆయన నో చెప్పారు. నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా సైతం పోటీ చేయలేనని తప్పుకున్నారు. తర్వాత బెంగాల్‌ మాజీ గవర్నర్‌, మహత్మాగాంధీ మనవడు గోపాలకృష్ణ గాంధీ కూడా పోటీ చేయబోనని కుండబద్దలుకొట్టారు.

ఢిల్లీలో ఎన్సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌ నేతృత్వంలో 17 ప్రతిపక్ష పార్టీల నేతలు భేటీలో అభ్యర్థి పేరును ఖరారు చేసే అవకాశంఉంది. అయితే విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా మాజీ ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా పేరు దాదాపు ఖరారైనట్లు సమాచారం. ఈ ఉదయమే ఆయన టీఎంసీకి రాజీనామా చేయడం ఇందుకు ఊతమిస్తోంది.