వెన‌క్కి త‌గ్గిన ట్రంప్ అమెరికాలో కొత్త ఆంక్ష‌లు

వెన‌క్కి త‌గ్గిన ట్రంప్ అమెరికాలో కొత్త ఆంక్ష‌లు

0
98

క‌రోనాతో ముందు చైనా అత‌లాకుతం అయింది, త‌ర్వాత ఇట‌లీ దారుణ‌మైన స్దితికి చేరుకుంది, ఇప్పుడు అమెరికా మ‌రింత ఆందోళ‌న‌లో ఉంది, అమెరికాలో ల‌క్ష పాజిటీవ్ కేసులు న‌మోదు అయ్యాయి, ఈ స‌మ‌యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మరో రెండు వారాల్లో మరణాల రేటు భారీగా పెరిగే అవకాశం ఉందని అంచనా వేశారు.

ఈ నేపథ్యంలో మహమ్మారి కట్టడికి కోసం చేపట్టిన ఆంక్షల్ని ఏప్రిల్‌ 30 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. ప్రజలంతా ప్రభుత్వ నిబంధనల ప్రకారం అప్పటి వరకు సామాజిక దూరం పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. అమెరికాలో మ‌రిన్ని కేసులు పెరిగే అవ‌కాశం ఉంది అని తెలుస్తోంది, అందుకే జాగ్ర‌త్త‌గా ఉండాలి అని తెలిపారు,

ఈస్టర్‌ పర్వదినం నాటికి అంతా సర్దుకోవాలని తాను ఆశించానన్నారు. కానీ, పరిస్థితులు ఆ దిశగా సాగడం లేదని నిరాశ వ్యక్తం చేశారు. దేశంలో మ‌రో 15 రోజులు సోష‌ల్ డిస్టెన్స్ పాటించాలి అని తెలిపారు.
అమెరికాలో ఇప్పటి వరకు 1,42,226 మందికి కరోనా వైరస్‌ సోకింది. వీరిలో 2,493 మంది మరణించారు.