ఈ రోజు విజయనగరం జిల్లా నెల్లిమల్లిలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది… రామతీర్థంలో విగ్రహ ద్వంసంకు వ్యతిరేకంగా గత కొద్ది కాలంగా బీజేపీ ధర్నా చేస్తోంది… అయితే తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈరోజు అక్కడకు చేరుకుని రామతీర్థాన్ని పరిశీలించేందుకు బయలుదేరాదు…
అయితే అక్కడకు అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి చేరుకుని రామతీర్థంను పరిశీలించారు ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ… చంద్రబాబు నాయుడు పై ఆయన కుమారుడు లోకేశ్ పై ఫైర్ అయ్యారు…
ట్విట్టర్ ద్వారా లోకేశ్ సవాల్ విసిరిన సవాల్ ను విజయసాయిరెడ్డి స్వీకరించారు లోకేశ్ డేట్ ఫిక్స్ చేస్తే తాను సింహాచలం అప్పన్న స్వామి ఆలయానికి వస్తానని అన్నారు… అక్కడ చర్చ పెట్టుకుందాము డేట్ మీరే ఫిక్స్ చేయమని అన్నారు… ఆలయాలను నిర్విర్యం చేసింది చంద్రబాబు నాయుడే అని విజయసాయి రెడ్డి ఆరోపించారు… పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని జీర్ణించుకోలేక చంద్రబాబు నాయుడు ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్నారని ఆయన మండిపడ్డారు… చంద్రబాబుకు దేవుడంటే భయం లేదు భక్తి లేదని ఆరోపించారు విజయసాయిరెడ్డి…