సీఎం కేసీఆర్ పై విజయశాంతి సీరియస్..‘KCR’కు కొత్త అర్థం ఇదేనంట

Vijayashanti is serious about CM KCR .. This seems to be the new meaning for ‘KCR’

0
97

తెలంగాణ సీఎం కేసీఆర్ పై బీజేపీ నేత విజయశాంతి ఫైర్ అయ్యారు. కేసీఆర్ నిరంతరం అవకతవక వాగ్దానాలతో, అబద్ధపు హామీలతో ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. KCR అంటే కల్వకుంట్ల చంద్రశేఖర్ కాదు. “(K)కోతి (C)చేష్టల (R)రావు” గారి రాజ్యం తీరుగా చేసి గత్తర బిత్తర పరిపాలన నడిపిస్తుందని ఎద్దేవా చేశారు.

ఇక శ్రీరంగం కోవెల గజరాజు మొట్టికాయలు కొట్టినంకన్నా జర్రంత సక్కగైతదేమో అనుకుంటే… అట్లగాక రాష్ట్రానికి వచ్చిన వెంటనే బీజేపీని అడ్డుకోండ్రి. ఆ పార్టీ నాయకులను, కార్యకర్తలను తిరగనియ్యకండ్రి అంటూ సీఎం స్థాయి కూడా మరచి “(K)కొండెంగె (C)చిందుల (R)రావు” గారి రాజ్యం లెక్క మరింత తిక్క బెదిరింపులకు పాల్పడుతున్నరు.

ఇగ ప్రజల భయానికి జిల్లా పర్యటనలను మరోసారి కుంటి సాకులు చూపి, తప్పించుకుని ఎప్పటి లెక్కనే మోసపు మాటలు చెబ్తున్నరు. ఈ వింత, విపరీత, విచిత్ర విన్యాసాలన్నీ గమనిస్తున్న ప్రజలు సరైన సమయం కోసం హుజురాబాద్ తీరులో ఎదురు చూస్తున్నారని తనదైన శైలిలో విమర్శలు చేశారు.