లేడీ సూపర్ స్టార్ ఈ పేరు చెప్పగానే మనకు ఒకరే గుర్తు వస్తారు, ఆమె మాజీ ఎంపీ విజయశాంతి, అయితే రాజకీయంగా ఆమె ఎన్నో పదవులు చూశారు, తెలంగాణ కోసం పోరాటం చేశారు, అయితే ఆమె తాజాగా ఏ పార్టీతో రాజకీయ రంగప్రవేశం చేశారో అదే పార్టీలో మళ్లీ చేరారు, మరి ఆమె పొలిటికల్ లైఫ్ స్టోరీ ఓసారి చూద్దాం.
1998లో ఆమె సినిమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చి బీజేపీలో చేరారు. బీజేపీ మహిళా మోర్చా సెక్రటరీగా పనిచేశారు.
ఇక తర్వాత బీజేపీ నుంచి కొన్ని ఏళ్లకు బయటకు వచ్చి సొంతంగా ఓ పార్టీ పెట్టారు, అదే తల్లి తెలంగాణ పార్టీ.. అలా కొన్నేల్లు పోరాటం చేసిన తర్వాత ఆ పార్టీని2009 సంవత్సరంలో కేసీఆర్ సారధ్యంలోని టీఆర్ఎస్ పార్టీలో విలీనం చేశారు.
2009లో టీఆర్ఎస్ ఎంపీగా మెదక్ నుంచి పోటీ చేసి గెలిచారు. తెలంగాణ ఉద్యమంలో భాగంగా ఆమె తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు, ఇక కొన్నేళ్లకు కేసీఆర్ పార్టీ నుంచి ఆమె బయటకు వచ్చారు, సోనియా గాంధీ సమక్షంలో ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరారు..2015లో హస్తం పార్టీలో చేరిన ఆమె ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు.
ఇక నేటి వరకూ కాంగ్రెస్ లో కొనసాగిన ఆమె తాజాగా బీజేపీ గూటికి చేరారు. ఎక్కడి నుంచి తన రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టారో మళ్లీ అక్కడికే వచ్చారు. ఇక మరో విషయం ఏమిటి అంటే. ఆమె సినిమాల్లో స్టార్ గా ఉన్న సమయంలో
1998లో బీజేపీలో చేరకముందు తమిళనాట అన్నాడీఎంకే పార్టీకి మద్దతు పలికారు. జయలలిత తరఫున ప్రచారం కూడా నిర్వహించారు. ఇలా ఆమె పొలిటికల్ గా ప్రజల్లో నాటి నుంచి కొనసాగుతున్నారు.