విజయసాయిరెడ్డి చంద్రబాబు పై సంచలన వ్యాఖ్యలు

విజయసాయిరెడ్డి చంద్రబాబు పై సంచలన వ్యాఖ్యలు

0
85

ఏపీ అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఉద్దేశిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు… అమరావతి లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు ప్రవేశించింది. అంతగా సురక్షితం కాని పల్లపు ప్రాంతాన్ని రాజధానిగా ఎందుకు ఎంపిక చేశారని రేపు కేంద్రం ఆరా తీస్తుందని ఆయన ప్రశ్నించారు.

అలాగే ప్రజలు కూడా ప్రశ్నిస్తారు. జవాబు చెప్పలేకే బాబు గారి నివాసాన్ని వరదలో ముంచారనే దుష్ప్రచారం మొదలు పెట్టారు ‘తీసేసిన తాసిల్దార్లు’. ఎగువ నుంచి వచ్చే వరద ప్రవాహాన్ని అంచనా వేసి కిందకు ఎంత వదలాలి అనేది ఇరిగేషన్ ఇంజనీర్లు నిర్ణయిస్తారని విజయసాయి రెడ్డి అన్నారు.

డ్యాం, బ్యారేజిల భద్రత వారికి ముఖ్యం. బ్యారేజి దిగువ ప్రజలు బలై పోయినా ఫర్వాలేదట. తన అక్రమ కొంప మునగటానికి వీల్లేదని కుట్ర స్టోరీలు తెరపైకి తెస్తున్నారు చంద్రబాబు నాయుడు అని విజయ సాయిరెడ్డి మంది పడ్డారు.