ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరికి అమ్ముడు పోయారని తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శలు చేసిన సంగతి తెలిసిందే… దీనిపై కన్నా స్పందించారు…
విజయసాయిరెడ్డి తనపై లేనిపోని ఆరోపణలు చేశారని ఆయన ఆరోపించారు… జైలు నుంచి వచ్చిన వ్యక్తి తన గురించి మాట్లాడటం హాస్యస్పదంగా ఉందని అన్నారు.. తనను ఎవరు కొనుగోలు చేసే పరిస్థితి లేదని అన్నారు…
విజయసాయిరెడ్డి మరోసారి ఇలా మాట్లాడితే మర్యాదగా ఉండదని వార్నింగ్ ఇచ్చారు… విజయసాయిరెడ్డిపై పరువునష్టం దావా వేస్తానని హెచ్చరించారు… వైసీపీ నాయకులు అధికార మదంతో మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు…